Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటితో ఫుల్‌స్టాప్..

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్
నేటి సాయంత్రం నాలుగు గంటలతో ముగియనున్న ప్రచారం
ప్రలోభాలకు తెర
పట్టుపెంచే ప్రయత్నాల్లో బీజేపీ
ఉనికి కోసం లెఫ్ట్ , కాంగ్రెస్ పాట్లు
కోదండరాం ,నాగేశ్వర్ ల భవిత్యం పై ఓటరు తీర్పు
ఉద్యమాల డాక్టర్ , మీడియా టైగర్ ,మహిళా బెబ్బులిలకు పరీక్షా సమయం
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం నాలుగు గంటలతో ప్రచారం ముగియనుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎదురైన పరాభవం ,గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలతో కంగుతిన్న అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్నికలు జరుగుతున్న ఆరు ఉమ్మడి జిల్లాల్లోని ,మంత్రులు , పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను రంగంలోకి దించిన టీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేసింది. ప్రలోభాలకు తెరలేచిందనే విమర్శలు ఉన్నాయి. ఓటర్ల చేర్పింపు దగ్గరనుంచి చివరివరకు ప్రచారాన్ని ప్రణాళిక బద్దంగా నిర్వహించారు. సాధారణ ఎన్నికలను తలపించే స్థాయిలో జరిగిన ఈ ప్రచారం రక్తికట్టింది.విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లుతో ఎన్నికల ప్రచారం రంజుగా సాగింది. ఒక్క సీఎం తప్ప రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం ,వరంగల్ ,నల్లగొండ స్థానానికి పల్లా రాజేశ్వరరెడ్డి ,హైద్రాబాద్,రంగారెడ్డి , మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ కి చెందిన రామచందర్ రావు లు సిట్టింగ్ లు అయినందున వారి భవిత్యం ఎలా ఉంటుందో అనే ఆశక్తి నెలకొన్నది .
మరోవైపు, వరుస పరాభవాలతో కుంగిపోతున్న కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల ద్వారా ఉనికి కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములు నాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క , రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,జీవన్ రెడ్డి , శ్రీధర్ బాబు, తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక, రాష్ట్రంలో తమకు పెరుగుతున్న బలాన్ని మరింతగా పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ నుంచి ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిలు బరిలో ఉన్నారు. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు వారి తరపున ప్రచారం చేశారు.
అందరికంటే ముఖ్యంగా తెలంగాణ జనసమితి (టీజేఎస్)కి ఈ ఎన్నికలు చావోరేవో లాంటివి. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న ఆ పార్టీ చీఫ్ కోదండరాం ఖమ్మం నుంచి బరిలో ఉన్నారు. టీడీపీ, న్యూడెమోక్రసీ పార్టీలు ప్రత్యక్షంగానే మద్దతు ఇచ్చాయి. పార్టీ భవితవ్యం ఈ ఎన్నికల్లో ఆయన గెలుపోటములపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
వామపక్షాలు బలపరిచిన అభ్యర్థులుగా ,ఖమ్మం వరంగల్ ,నల్లగొండ, నుంచి జయసారధి రెడ్డి, మహబూబ్ నగర్, హైద్రాబాద్ , రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రొఫెసర్ ,నాగేశ్వర్ లు పోటీచేస్తున్నారు. సిపిఐ ,సిపిఎం పార్టీలు ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నాయి.

నల్లగొండ ,ఖమ్మం ,వరంగల్ , స్థానం నుంచి మొత్తం 71 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా , హైద్రాబాద్,మహబూబ్ నగర్,రంగారెడ్డి నుంచి 93 మంది పోటీచేస్తుండటం గమనార్హం. టీఆర్ఎస్‌,బీజేపీ లకు సిట్టింగ్ స్తనాలు కావడంతో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రచారం చేశాయి.

Related posts

పవన్ మరో తప్పటడుగు వేయనున్నారా… ?

Drukpadam

ఎవడ్రా నీకు మరదలు … వ్యవసాయ శాఖ మంత్రిపై షర్మిల ఘాటు విమర్శలు…

Drukpadam

మహా’ సర్కారు.. పతనం ఖాయమేనా …?

Drukpadam

Leave a Comment