Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆజాద్ అండ్ కో తో తెగతెంపులేనా ?

ఆజాద్ అండ్ కో తో తెగతెంపులేనా ?
-30 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాభితా
-అసమ్మతి వాదులకు దక్కని చోటు
-జాబితా విడుదల చేసిన ఏఐసీసీ
-సోనియా, మన్మోహన్ ,రాహుల్ , ప్రియాంక లతో పాటు 30 మంది చోటు
-జి-23 నేతల కదలికల పై కాంగ్రెస్ కన్ను
ఆజాద్ అండ్ కో తో కాంగ్రెస్ పార్టీ తెగతెంపులేనా అంటే అవుననే అంటున్నారు రాజకీయపరిశీలకులు .
కాంగ్రెస్ పార్టీ అసమ్మతి వాదుల విషయంలో కఠినంగానే వ్యవహరించాలనే అభిప్రాయంతో ఉన్నట్లుంది . పార్టీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం కోసం, ఎన్నికల సంఘానికి స్టార్ క్యాంపెయినర్ల జాబితా అందజేసింది . ఆ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అసమ్మతి వాదులకు చోటు కల్పించకపోవటమే ఇందుకు తార్కాణంగా ఉంది. పైగా ఇటీవల వారు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా బీజేపీ పార్టీ విధానాలపై పార్టీ పోరాడుతుంటే అందుకు భిన్నంగా వారు వ్యవహరించటం కాంగ్రెస్ పార్టీ లోని సోనియా విధేయులకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే వారిపట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించినట్లు ఉంది. అందువల్లనే వారు మేము ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ప్రచారానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ స్పందనలేదు. పైగా ప్రచార కమిటీ లో కూడా చోటు దక్కక పోవటంతో వారు ఆలోచనలో పడ్డారు. తమ అసమ్మతి కార్యకలాపాలు పక్కనపెట్టి తెల్లజెండా ఎత్తటమా లేక తిరుగుబాటు నేతలు ప్రత్యాన్మాయం ఆలోచించటమా అనేది ఉంది. తిరుబుబాటు చేసిన నేతల్లో ఒకరిద్దరు మినహా పెద్దగా జనంతో సంబంధం ఉన్నవాళ్లు లేరనే అభిప్రాయాలే ఉన్నాయి. దీంతో జి -23 నేతల కదలికలపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది.కాంగ్రెస్ పార్టీ నిజంగా కష్టకాలం లో ఉంది దాన్ని ఆడుకొని కాపాడుకోవాల్సిన పార్టీ నేతలు అందుకు భిన్నంగా వ్యవహరించటంపై కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఇటీవల రాజ్యసభ నుంచి రిటైర్ అయినా గులాం నాభి ఆజాద్ కాంగ్రెస్ లో ని అసమ్మతికి కేంద్ర బిందువుగా మారారు . 23 మంది అసమ్మతి గ్రూపుగా ఏర్పడి సోనియాకు లేఖ రాసిన వారిలో ఆజాద్ ముఖ్యుడు . కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పదవులు అనుభవించారు. కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన వ్యక్తులుగా చలామణి అయినవారు పార్టీకి వ్యతిరేకంగా ముఠా కట్టడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆజాద్ మొన్నటి వరకు రాజ్యసభలో పార్టీ లీడర్ గా ఉన్నారు. ఆయన రిటైర్ మెంట్ సందర్భంగా రాజ్యసభలో ప్రధాని ఆజాద్ ను పొగడటం కన్నీరు పెట్టడం జరిగాయి. స్వయానా ప్రధాని పార్లమెంట్ సాక్షిగా పొగిడిన తరువాత ఎవరు మాత్రం పొంగిపోకుండా ఉంటారు. ఆజాద్ అందుకు మినహాయింపుకాదు . ఆయన మానవ మాత్రుడేకదా?
అందువల్ల ఉబ్బితబ్బిబు అయిపోయాడు. అంతవరకూ ఫర్వాలేదు అనుకున్న ప్రధాని లాంటి వ్యక్తిని తాను చూడలేదని పొగడటం ప్రారంభించారు. సందర్భం అదే కాబట్టి రాజ్యసభలో పొగిడితే ఇబ్బంది లేదు కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో మీటింగ్ పెట్టి మరి పొగడటం ఆజాద్ లాంటి నాయకుడికి సరైంది కాదనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. ఈ చర్యలు కాంగ్రెస్ పార్టీని నష్ట పరిచేలా వ్యవహరించటం కాంగ్రెస్ నాయకత్యానికి మింగుడుపడని అంశంగా ఉంది . వారిపై కాంగ్రెస్ లో ఇప్పటికే చర్చలు జరుగుతుండగా ఆజాద్ ప్రధాని మధ్య స్నేహ రాగాలు మరింత ఆజ్యం పోశాయి. ప్రధాని ఆజాద్ ను పొగడటం ద్వారా కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నాయకుల వాదనల పై రకరకాల అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . అసమ్మతికి కారణం కాంగ్రెస్ పార్టీని బలపరచడమా?బలహీనపరచడమా? అనేది చర్చనీయాంశంగా మారింది.దీంతో కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకుంటారా ?లేక కలిసి పని చేస్తారా ? తిరుగుబాటు చేసిన వారు ఏమి చేయనున్నారనే ఆశక్తి నెలకొన్నది .

Related posts

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరతపై కేరళ సీఎం ఆందోళన:కేంద్రంపై వత్తిడికి కలిసి రావాలని11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ…

Drukpadam

ఏపీ సీఎం జగన్ కు చిరంజీవి సుతిమెత్తని హెచ్చరిక …కష్టాల్లో ఉన్న పరిశ్రమని ఆదుకోవాలని విజ్ఞప్తి!

Drukpadam

కేసీఆరే అధ్యక్షుడు …కేటీఆర్ మరికొద్ది కాలం ఆగాల్సిందే -రంగంలోకి దిగిన మంత్రులు!

Drukpadam

Leave a Comment