Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు లో పార్టీ సత్తా తేలాలి :పార్టీ ఇంచార్జి శివకుమార్

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు లో పార్టీ సత్తా తేలాలి :పార్టీ ఇంచార్జి శివకుమార్
-పార్టీ సభ్యత్వానికి అనూహ్య స్పందన
-ఈసారి ఇన్సురెస్ తో కూడిన సభ్యత్వం
-కార్యకర్త ప్రమాద వశాత్తు మరణిస్తే 2 లక్షలు కుటుంబానికి
-ప్రతి ఇంటికి కాంగ్రెస్ దేశానికి ఏమి చేసిందో చెప్పాలి

సభ్యత్వ నమోదు తో మన సత్తా తేల్చాలి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ శివకుమార్ ఈరోజు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ సభ్యత్వ నమోదు పై పత్రికా సమావేశం జరిగింది ఈ పత్రికా సమావేశంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ కమిటీ నుంచి టీపిసిసి సెక్రెటరీ శివ కుమార్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ…..

భారత దేశానికి స్వాతంత్రం
తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవటం అదృష్టమని ఈసారి సభ్యత్వం డిజిటల్ ఆన్లైన్ రూపేణ కల్పించారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ప్రతి డివిజన్ కి లింక్ పంపించడం జరుగుతుంది. ఆ డివిజన్ లో ఉన్నటువంటి బూతు అధ్యక్షులు బూత్ ఎం రోలర్ గా డివిజన్ అధ్యక్షులు నిర్మిస్తారని ప్రతి బూత్ అధ్యక్షుడు వంద మందినీ సభ్యత్వ నమోదు చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని ప్రతి ఆరు డివిజన్ల కి ఒక ఇంచార్జ్ ను నియమిస్తూ పది మందిని పూర్తిగా ఇన్చార్జిలు గా నియమిస్తామని ఈ నెల ఆఖరి వరకు ఖమ్మం నియోజకవర్గంలోని అన్ని బూతులు సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు సభ్యత్వ నమోదు చేయించుకున్న టువంటి ప్రతి సభ్యునికి ఇన్సూరెన్స్ చెందేటట్లు గా ఈసారి సభ్యత్వం ఏర్పాటు చేయనుందని కావున ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన ప్రమాదం జరిగి అంగవైకల్యం చెందిన ప్రమాద భీమా వర్తిస్తుందని ఇందుకుగాను కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు లక్షల రూపాయలు చెల్లిస్తుందనీ చెప్పారు

ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో జరిగిన ఖమ్మం అసెంబ్లీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ మడుపల్లి భాస్కర్ , సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ ఏలూరు రవి కుమార్ , కొప్పెర ఉపేందర్ , శంకర్ నాయక్, మద్ది వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related posts

రాహుల్ అనర్హతపై స్పందించిన జర్మనీ.. విదేశీ జోక్యాన్ని సహించబోమన్న భారత్…

Drukpadam

అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగానేనా ….?ప్రజాసమస్యలు పట్టవా ??

Drukpadam

గుంటూరు జిల్లా టీడీపీ నేత చంద్ర‌య్య దారుణ హ‌త్య‌…

Drukpadam

Leave a Comment