షర్మిల పార్టీ లోకి ఏపూరి సోమన్న…
-సాదరంగా ఆహ్వానించిన షర్మిల
– వై యస్ ఆర్ అభిమానులు తెలంగాణలోనే ఎక్కువ
-జీవితాంతం షర్మిల అక్కతోనే తన ప్రయాణమని వెల్లడించిన ఏపూరి
-వై వైస్ కుటుంబం ఇచ్చిన మాట తప్పదని అనేక మంది చెప్పారన్న సోమన్న
వై యస్ షర్మిల పార్టీలో ప్రముఖ జానపద కళాకారుడు ఏపూరి సోమన్న చేరారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తన పాటల ద్వారా ఉద్యమాన్ని ఉర్రుతలు ఊగించారు. 16 సంవత్సరాలపాటు టీఆర్ యస్ తో తన ప్రయాణాన్ని కొనసాగించిన సోమన్న 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆపార్టీ కోసం రాష్ట్ర అంత ప్రయాణించారు. ఏపూరి సోమన్న అంటే రాష్ట్రంలో తెలియని వారు ఉండరు. ఆయన లోటస్ పాండ్ లో షర్మిల సమక్షంలో వైయస్ కుటుంబంలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాను జీవించినంతకాలం షర్మిల అక్కతో కలిసి నడుస్తానని అన్నారు. వైయస్ కుటుంబం మాట ఇస్తే తప్పని కుటుంబమని అనేక మంది తనకు చెప్పిన విషయాలను ప్రస్తావించారు. తన అట పాటలతో సమావేశాన్ని రక్తి కట్టించారు. షర్మిల పై పాట పాడి ఇది రాష్ట్ర వ్యాపితంగా మారుమోగలని అన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తమ పార్టీలోకి సోమన్న రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఏపూరి సోమన్న నాతోకలిసి నడిచేందుకు నిర్ణయించు కోవటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. వైయస్ ఆర్ మరణం తట్టుకోలేక తెలంగాణాలో ఎక్కువగా 700 మరణించారని గుర్తు చేశారు.తాను తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కొండను ఢీకొంటున్నానన్న సంగతి తెలుసనీ అన్నారు. ఈ పోరాటం అంత సులభమైంది కూడా కాదని తనకు తెలుసనీ అన్నారు. సోమన్న లాంటి వారు తనతో చేతులు కలపడం తనకు బలాన్ని ఇచ్చే అంశం అన్నారు.వైయస్ కుటుంబంలోకి ఆయన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట అనేక మంది కళాకారులూ షర్మిల పెట్టబోయే పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రంలో సోమన్న వెంట వచ్చిన వారితో పాటు షర్మిల తో కలిసి నడిచేందుకు నిరణయించుకున్న అనేకమంది పాల్గొన్నారు.
previous post
next post