Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బడ్జెట్ పన్ను ప్రతిపాదనలపై నిపుణుల అభిప్రాయాలు…

బడ్జెట్ పన్ను ప్రతిపాదనలపై నిపుణుల అభిప్రాయాలు…

  • పన్ను ఊరట లేకపోవడంపై నిట్టూర్పు
  • క్రిప్టోలపై అధిక పన్ను భారం
  • గరిష్ఠ స్థాయిలోనే ద్రవ్యలోటు

బడ్జెట్ లో వేతన జీవులకు పన్ను పరంగా ఎటువంటి ఊరటనను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కల్పించలేదు. పెట్టుబడుల విషయంలోనూ పన్నుపరంగా ఎటువంటి ఉపశమనం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో ఆకర్షణీయమైన తాయిలాల జోలికి కూడా ఆమె వెళ్లలేదు.

కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని, ఆదాయంపై ప్రభావం చూపించే నిర్ణయాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ అంశాలకు బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. బడ్జెట్లో పన్ను అంశాలపై నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

బడ్జెట్ లో అధిక ద్రవ్యలోటు 6.4 శాతాన్ని పేర్కొనడం మార్కెట్లను నిరాశపరిచి ఉండొచ్చు. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న తరుణంలో దూకుడైన ద్రవ్య స్థిరీకరణ జోలికి పోకపోవడమే ఉత్తమమైనది

– అభిషేక్ బారువా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్

వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు కరోనా మహమ్మారి సమయంలో కాస్త ఉపశమనాన్ని ఆశించారు. ధరల పెరుగుదల, వేతన కోతల ప్రభావాన్ని వారు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక మంత్రి, ప్రధాన మంత్రి మరోసారి ప్రత్యక్ష పన్నుల విషయంలో తీవ్ర నిరాశకు గురిచేశారు.

– రాజ్ దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ

క్రిప్టో మైనింగ్, బహుమానంపై 30 శాతం పన్ను విధించారు. ఇతర రూపాల్లో ఎదుర్కొన్న నష్టాన్ని సర్దుబాటు చేసుకునేందుకు అనుమతించలేదు. క్రిప్టో లావాదేవీలపై ఆర్థిక మంత్రి మరింత స్పష్టతను ప్రకటించారు. కానీ, కేంద్ర నియంత్రణ లేకుండా ఆ లావాదేవీలను ట్రాక్ చేయడం సవాలే.

– ప్రణయ్ భాటియా, ట్యాక్స్ అండ్ రెగ్యులేటరీ సర్వీసెస్ పార్ట్ నర్

క్రిప్టో కరెన్సీలపై పన్ను విషయంలో ప్రభుత్వం రక్షణాత్మక విధానాన్ని ఎంచుకుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను అంటూ ఏదీ లేదు. క్రిప్టో ఆస్తుల బదిలీ ద్వారా వచ్చిన లాభంపై ఫ్లాట్ 30 శాతం పన్ను విధించారు. కొనుగోలు వ్యయం తప్ప ఇతర ఖర్చులను చూపించుకోవడానికి లేదు. క్రిప్టో అసెట్స్ ను బహుమతిగా ఇస్తే స్వీకరించే వారు ఒక శాతం టీడీఎస్ కట్టాల్సి వస్తుంది.

– గౌరిపురి, శార్దుల్ అమరచంద్ మంగళ్ దాస్ పార్ట్ నర్

Related posts

పంజాబ్ రైతులు మోదీపై ఆగ్రహంతో ఉన్నారు… ఎన్నికలతో అది స్పష్టమైంది: శరద్ పవార్

Drukpadam

గుజరాత్ ఓట్లతో ఆప్ కు జాతీయ పార్టీ హోదా!

Drukpadam

తెలంగాణ రాష్ట్రాన్ని దళిత ద్రోహి ఏలుతున్నాడు: బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు…

Drukpadam

Leave a Comment