Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తుమ్మలతో టీఆర్ యస్ నాయకుల వరస భేటీల ఆంతర్యం ఏమిటి ?

తుమ్మలతో టీఆర్ యస్ నాయకుల వరస భేటీల ఆంతర్యం ఏమిటి ?
మొన్న హరీష్ రావు ,నిన్న ఎమ్మెల్యే బృందం
హితులు సన్నిహితులతో సమాలోచనలు
కేసీఆర్ డైరక్షన్ లోనే మంత్రి హరీష్ ,ఎమ్మెల్యే లు కలిసి ఉంటారనే అభిప్రాయాలు
చక్రం తిప్పిన వాణ్ణి చతికల పడేస్తారా? అంటూ అనుయాయుల ఆగ్రహం

తుమ్మల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జగమెరిగిన బ్రాహ్మణుడు …పరిచయం అక్కర్లేని వ్యక్తి …తెలుగు దేశం హయాంలో తన కనుసైగలతో అభివృద్ధిని పరుగులు పెట్టించిన నేత …ఉమ్మడి రాష్ట్రంలో సైతం కీలకమైన భారీనీటిపారుదల , రోడ్లు భవనాలు శాఖలు నిర్వహించిన సీనియర్ మంత్రి… ఒకరకంగా చెప్పాలంటే రాజకీయాల్లో తనదంటూ ఒక ప్రత్యేక శైలిని అలవర్చుకున్న నేత …టీడీపీ హయాంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ట్రబుల్ షూటర్ గా మంచి గుర్తింపు పొందారు …ఖమ్మం జిల్లాలో రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిన నాయకుడు … అసెంబ్లీ సీట్లు తాను ఎవరికీ ఇవ్వాలనుకుంటే వారికీ ఇప్పించుకున్న తిరుగులేని నేత … అలాంటి తుమ్మలకు నేడు కష్టాలు వచ్చాయా ? ట్రబుల్ షూటర్ కాస్త ట్రబుల్ లో పడ్డారా ? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు … ఎంతో మందిని రాజకీయాలకు పరిచయం చేసి సీట్లు ఇప్పించిన తుమ్మల నేడు తన సీటు కోసం ప్రాధేయపడాల్సిన పరిస్థితి …

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలుగుదేశంకు రాజీనామా చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ యస్ లో చేరారు . తెలుగుదేశంలో మంచి మిత్రులుగా ఉన్న కేసీఆర్ ,తుమ్మల సంబంధాలు మొదట బాగానే కొనసాగాయి.కేసీఆర్ మాట ఇచ్చినట్లుగానే తుమ్మల టీఆర్ యస్ లో చేరిన కొద్దీ రోజులకే మంత్రిని చేశారు . ఎమ్మెల్సీ ని చేశారు .ఎమ్మెల్సీగా ఉంటూనే పాలేరు ఉపఎన్నికల్లో పోటీచేసి ఘన విజయం సాధించారు . అభివృద్ధిని పరుగులు పెట్టించారు . 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే పాలేరు నుంచి టీఆర్ యస్ తరుపున పోటీచేసిన తుమ్మల కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటి సారి పోటీచేసిన కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు . ఈ ఓటమే తుమ్మల రాజకీయానికి టర్నింగ్ పాయింట్ గా మారింది . తన ఓటమికి సొంతపార్టీ వెన్నుపోట్లే కారణమని తుమ్మల అభిప్రాయపడ్డారు . ఇదే విషయం కేసీఆర్ సైతం వెల్లడించారు. తమ కత్తులు తమనే పొడిచాయని పేర్కొన్నారు . దీంతో తుమ్మల తీవ్ర అసహనానికి గురైయ్యారు . పొడిచిన కత్తులపై ఎలాంటి చర్యలు లేవు . వారి ఎవరో ఇప్పటివరకు వెల్లడించలేదు . దీనిపై ఎలాంటి విచారణ జరగలేదు …నాటి నుంచి తుమ్మల జిల్లా రాజకీయాలపట్ల అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఇది జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది .

తుమ్మలకు కేసీఆర్ వద్ద గతంలో ఉన్న ప్రయారిటీ తగ్గిందని ప్రచారం ఊపందుకున్నది .ఇదే నిజమే అన్నట్లు కేసీఆర్ తుమ్మల ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లపై నెగిటివ్ కామెంట్ చేశారని వార్త కథనాలు వచ్చాయి. అయినా ఇరువురు నేతలు దానిపై స్పందించలేదు . ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్ నేతలుగా ఉన్న తుమ్మల ,పొంగులేటిని కాదని తాతా మధుకు సీటు ఇచ్చి గెలిపించారు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తాతా మధు కు సహకరించలేదని ఫిర్యాదులు వెళ్లాయి.

దీంతో ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్ ద్రుష్టి సారించారు. ఇందులో భాగంగానే తుమ్మలతో చర్చించేందుకు సీనియర్ మంత్రి ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు ను పంపించారని తెలుస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన మంత్రి హరీష్ రావు తుమ్మల గెస్ట్ హౌస్ లో రాత్రి మకాం వేశారు .అక్కడకు మంత్రి అజయ్ గాని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ,లేదా అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు గాని ఎవరు వెళ్లలేదు . కేవలం కొద్దీ మంది తుమ్మల అనుయాయిలు మాత్రమే అక్కడకు వెళ్లారు . హరీష్ రావు తుమ్మల వ్యవసాక్షేత్రాన్ని కూడా సందర్శించారు . తుమ్మల తన వ్యవసాయాన్ని గురించి ఆయనకు వివరించారు. సీఎం కేసీఆర్ అనుమతి లేకుండా మంత్రి హరీష్ తుమ్మల గెస్ట్ హౌస్ లో మకాం వేయడం జరిగే పనికాదని అభిప్రాయాలు ఉన్నాయి . అందువల్ల కేసీఆర్ హిరిష్ రావు ద్వారా తుమ్మలకు ఏమి సందేశం పంపించారు అనేది ఆశక్తిగా మారింది.

హరీష్ వచ్చి వెళ్లిన రెండు రోజులకే కొందరు కీలక ఎమ్మెల్యేలు తుమ్మల దగ్గరు వెళ్లి కలిశారు . ఈ భేటీల వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది ఇప్పడు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆశక్తిగా మారింది. తనను కలిసిన వారితో తుమ్మల ఏకాంతంగా మాట్లాడాడు . తుమ్మల సహాయం పొందిన ఆ ఎమ్మెల్యేలు ఏ రాజకీయం నిర్ణయమైనా తొందరపడి తీసుకోవద్దని తుమ్మలను కోరినట్లు సమాచారం . తమకు మీ ఆశీస్సులు ఉండాలని వచ్చిన ఎమ్మెల్యేలు అన్నట్లు తెలుస్తుంది. సీఎం కేసీఆర్ తగిన ప్రయారిటీ ఇస్తారని అంతవరకూ వేచి ఉండమని సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో తుమ్మల ఆలోచనలో పడినట్లు ఆయన అనుయాయులు పేర్కొంటున్నారు . చూద్దాం భవిష్యత్ లో ఏమి జరుగుందో … రాజకీయాలు కదా ఏదైనా సాధ్యమే ……

Related posts

ఓపిక నశించింది.. అణుబాంబు వేసే సమయం వచ్చింది…పుతిన్‌

Drukpadam

ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం …మండలంలో 10 వేల చేర్పిస్తే రాహుల్ తో సన్మానం!

Drukpadam

దటీస్ కేసీఆర్ దేశమంతా ఇదే ఫార్ములా …అభ్యర్థికి బీఫామ్‌తో పాటు రూ.40 ల‌క్ష‌ల చెక్కు!

Drukpadam

Leave a Comment