Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

6 వ రౌండ్ పూర్తి పల్లా లీడ్ 23 వేలు

నల్లగొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో 6 వ రౌండ్ పూర్తి అయిన తరువాత టీఆర్ యస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి కి 95,309 ఓట్లు రాగ సమీప స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు 73,405 ,కోదండరామ్ కు 56,675 ఓట్లు లభించాయి . ప్రథమ ప్రాధన్యత లెక్కింపుకు ఇక ఒక రౌండ్ మాత్రమే మిగిలి ఉంది. 6 వ రౌండ్‌లో పల్లాకు 16,198 ఓట్లు రాగ మల్లన్నకు 11,900,కోదండరామ్ కు 10,584 ఓట్లు లభించాయి .ఫలితం తేలాలంటే రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే గాని అభ్యర్థుల భవితవ్యం తెలుస్తుంది. అందుకేసం మరో రోజు ఆగాల్సిందే.

వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి 6వ రౌండ్ ఫలితం విడుదల చేశారు. ఆ ప్రకారం ఇప్పటి వరకు అభ్యర్థులు సాధించిన ఓట్లు 6 రౌండ్లు కలిపి ఇలా ఉన్నాయి.

పల్లా రాజేశ్వరర్‌రెడ్డి – 95,317

తీన్మార్ మల్లన్న – 72,474

ప్రొ. కోదండరామ్ – 59,705

ప్రేమేందర్‌రెడ్డి – 34,228

తీన్మార్ మల్లన్న కంటె పల్లా రాజేశ్వరరెడ్డి 22,843 ఓట్ల ఆధిక్యం

కోదండరామ్ కంటె పల్లా రాజేశ్వరరెడ్డి 35,612 ఓట్ల ఆధిక్యం

Note : మొదటి ప్రాధాన్యత ఓట్లకి సంబంధించి ఇంకా ఒక్క రౌండ్ మాత్రమే మిగిలి ఉంది

Related posts

బరాదర్ చనిపోలేదు.. ఆడియో విడుదల చేసిన తాలిబన్లు…

Drukpadam

కృష్ణా జలాల వివాదం: ఏపీ పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ చేసిన సీజేఐ !,

Drukpadam

రెండు రోజులే ఛాన్స్‌.. ఛ‌లాన్ల క్లియ‌రెన్స్‌కు గ‌డువు పెంపు లేద‌ట‌!

Drukpadam

Leave a Comment