Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పల్లా కే ఆధిక్యం… కానీ విజేత కాలేదు

పల్లా కే ఆధిక్యం కానీ విజేత కాలేదు
నల్లగొండ లో ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్లు
-ఎవరికీ లభించని 50 శాతం ఓట్లు
-రెండవ రౌండ్ లెక్కింపు ప్రారంభం
-విజేత ఎవరనే దానిపై ఉత్కంఠ
నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన నల్లగొండ ,ఖమ్మం ,వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 7 రౌండ్ లలో అధికారులు పూర్తీ చేసి అభ్యర్థులకు వచ్చిన ఓట్లను ప్రకటించారు. అధికార టీఆర్ యస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి కి మొత్తం లక్ష 10 వేల 840 ఓట్లువచ్చి 27550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు కానీ ఇంకా విజేతకాదు రెండవ ప్రాధాన్యత ఓట్ల తరువాత గని వారి భవిత్యం తేలనుంది  .తీన్మార్ మల్లన్న కు 83290 ఓట్లు, కోదండరాం కు 70072 ఓట్లు లభించాయి. అయితే మైజారిటీ కి కావలిసిన మేజిక్ ఫిగర్ 50 శాతం దాటి ఎవరికీ రాలేదు .దీంతో రెండవ ప్రాధాన్యత ఓట్లపై విజేతను తేల్చేందుకు రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.
ఎన్నికల కౌంటింగ్ లో 7 రౌండ్ లు పూర్తీ అయిన తరువాత ప్రధాన పార్టీల అభ్యర్థులకు లభించిన ఓట్లు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పల్లా రాజేశ్వర్ రెడ్డి 1 ,10 ,840 కి లభించాయి .తీన్మార్ మల్లన్న కు 83 ,290 ఓట్లు , ప్రొఫెసర్ కోదండరాం కు 70072 బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కు 39 107 ఓట్లు లభించాయి ఇక 67 మంది అభ్యర్థులకు మిగతా ఓట్లు లభించాయి. మొత్తం 3 లక్షల 87 వేల 969 ఓట్లు పోలు కాగా వాటిలో 21 వేల 636 ఓట్లు చెల్లలేదు.కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ 25 వేలకు పైగా ఓట్లు పొందగా , వామపక్షాలు బలపరిచిన జయసారధిరెడ్డికి 9 వేలు ఓట్లు వచ్చాయి. చెరుకు సుధాకర్ కు 8 వేలు పైగా వచ్చాయి. ఓట్లు, రాణి రుద్రమకు 7 వేల కు పైగా ఓట్లు వచ్చాయి . బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ కు 3030 ఓల్టు షేక్ షబ్బీర్ అలీ కి వేయి కి పైగా ఓట్లు వచ్చాయి . మిగతా కొంత మందికి మరికొంత మందిఅభ్యర్థులకు వందల సంఖ్యలో , డబుల్ డిజిట్ దాటలేదు.
ఫలితం రావాలంటే మరొక రోజు ఆగాల్సి ఉంటుంది.

Related posts

డైలమాలో జగ్గారెడ్డి …పార్టీకి దూరంగా ఉండటమా ? వేరే పార్టీలో చేరడమా ?

Drukpadam

కరోనా కట్టడికి సూచనలు చేస్తూ ప్రధానికి ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి లేఖ

Drukpadam

పంతం నెగ్గించుకున్న కేరళ సర్కారు.. ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ తొలగింపు!

Drukpadam

Leave a Comment