Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రెండవ ప్రాధాన్యతలో కోదండరాం కు స్వల్ప ఆధిక్యం

రెండవ ప్రాధాన్యతలో కోదండరాం కు స్వల్ప ఆధిక్యం
-రెండవ స్థానంలో పల్లా
-మూడు తీన్మార్
రెండో ప్రాధాన్యతలోనూ….
ఆ…….ముగ్గురే…..!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖమ్మం ,నల్లగొండ ,వరంగల్ స్థానానికి జరుగుతున్నా లెక్కిపు ప్రక్రియలో ప్రారంభం అయింది.చివర 45 మంది ఎలిమినేట్ అయ్యారు. వారి మొత్తం ఓట్లు 1312 కాగా వాటిలో రెండవ ప్రాధాన్యత కింద పల్లా కు 228  ఓట్లు రాగ , తీన్మార్ మల్లన్న కు 184 ,కోదండరాం కు 250 ఓట్లు లభించాయి. మొదటి ప్రాధాన్యత లో ఎవరికీ గెలుపు కావలసిన ఓట్లు రాకపోవటంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కిపు ప్రారంభం అయింది.
మొదటి ప్రాధాన్యత లోను పల్లా రాజేశ్వర్ రెడ్డి , తీన్మార్ మల్లన్నలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా కోదండ రామ్ మూడోస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.రెండవ ప్రాధాన్యత లోను అదే ఓటింగ్ వస్తుంది . కోటా పూర్తి కావాలంటే 183 166 ఓట్లు + 1 కావాలి కానీ పల్లాకు 73 వేల ఓట్లు కావాలి. ఆ పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు.
…తీన్మార్ మల్లన్న రెండవ ప్రాధాన్యతలో ఆధిక్యత సాధిస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డికి వచ్చిన ఓట్లు లెక్కింపుకు వస్తాయి . అప్పుడు తీన్మార్,కోదండరాం
లకు రెండవ ప్రాధాన్యతలో ఓట్లు పెరగవచ్చు.
సీరియల్ నంబర్లు..
54 , 17 , 51 , 70 , 56 , 15 , 42 , 47 , 40 , 65 , 28 , 43 , 41 , 25 , 34 , 57 , 35 , 58 , 30 , 71 , 44 , 37 , 46 , 50 , 16 , 60 , 29 , 31 , 26 , 45 , 20 , 19 , 53 , 6 , 69 , 62 , 22 , 21 , 12 , 14 , 36 , 55 , 67 , 8 , 5 ఈ సీరియల్ నెంబర్ గల అభ్యర్థులు మొదటి ఎలిమినేషన్ లో 47 మంది వందలోపు ఓట్లు కలిగిఉండడంతో ఎలిమినేట్ అయ్యారు.
మల్లన్న,కోదండరాం ఓట్లు కలిపినా 1,53,362 మాత్రమే . కోటాకు మరో 30 వేల ఓట్లు కావాలి.ఇది రెండవ ప్రాధాన్యతలో వచ్చే అవకాశాలు లేవు
ఇప్పుడు షేక్ షబ్బీర్ అలీ – 1336 ఓట్లు , దుర్గా ప్రసాద్ మహారాజ్ – 3476 , రాణి రుద్రమ – 7756 , చెరుకు సుధాకర్ 8631 ఓట్లు , జయసారది రెడ్డి 9557 ఓట్లు , రాములు నాయక్ 27588 ఓట్లు ,ప్రేమిందర్ రెడ్డిల ఓట్లలో పల్లా ,తీన్మార్ ,కోదండరాంలు ఎక్కువ మెజార్టీ సాధించాల్సి ఉంది. లెక్కింపు కేంద్రం వద్ద తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.

Related posts

మీ ఆశీస్సులు మాకు అవసరం లేదు బెంగాల్ సీఎం కు స్పష్టం చేసిన విశ్వభారతి యూనివర్సిటీ …

Drukpadam

రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించింది చంద్రబాబే.. ఎందుకంటే?: పోచారం

Drukpadam

జగన్ మరో మారు మంత్రివర్గ విస్తరణ చేయనున్నారా …?

Drukpadam

Leave a Comment