Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ లో బీసీ ఎస్సీ ,ఎస్టీ , మైనార్టీల అంతర్మధనం …

టీఆర్ యస్ లో బీసీ ఎస్సీ ,ఎస్టీ , మైనార్టీల అంతర్మధనం …
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ముందు పీఠిన ఉన్న వర్గాలు
ఓట్లను మావి సీట్లు అధికారం మీద అంటూ రగులుతున్న బీసీలు
మంత్రి పదవుల్లోనూ , ఎమ్మెల్సీ ల్లోనూ తీవ్ర అన్యాయం
పల్లకి మోసే బోయలుగానే బడుగు బలహీన వర్గాలు
టీఆర్ యస్ కు మైనస్ గా మారబోతున్న రాజ్యాంగ సవరణ అంశం

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు గత 8 సంవత్సరాలుగా ఎన్నడూ లేనంత వేడి పుట్టిస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు .కేసీఆర్ ఏ వాగ్దనాలతో అయితే అధికారంలోకి వచ్చారో అవి నేర వేరలేదని ప్రజల అభీష్టానికి అనుగుణంగా కేసీఆర్ పరిపాలనలో ఉద్యమ కారులను ,ప్రత్యేకించి బీసీ,ఎస్సీ ,ఎస్టీ , మైనార్టీ లకు పాలనా భాగస్వామ్యం లేదని ఇచ్చే పదవుల్లో కూడా ఆవర్గాలకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయాలూ బలంగా ఉన్నాయి. ఫలితంగా బీసీ ఎస్సీ ,ఎస్టీ మైనార్టీలు ఉద్యమకారులు , ఆతర్మధనం చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు త్యాగాలు చేసింది. ఒకరైతే దానిఫలితాలు మరొకరు పొందడంపై జీర్ణించుకోలేక పోతున్నారు. మంత్రి వర్గంలో ,చివరకు ఎమ్మెల్యే,ఎంపీ ,ఎమ్మెల్సీ ల టికెట్స్ కేటాయింపులో జరుగుతున్న అన్యాయాలపై మండి పడుతున్నారు .

టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నో వేలమంది నాయకులను తయారు చేశామని, ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, పార్లమెంటు సభ్యులుగా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌లుగా తయారు చేశామని కేసీఆర్ ఇటీవల ఒక మీడియా సమావేశంలో చెప్పారు.
కానీ అవకాశాలు ఎవరికీ ఇస్తున్నారనే ప్రశ్న ఉదయిస్తుంది. ఉద్యమకారులను పక్కన పెట్టారు . బీసీ ,ఎస్సీ ,ఎస్టీ మైనార్టీ వాళ్ళను పక్కన పెట్టారు. ఉద్యమ ద్రోహులను , తెలంగాణ రావడం ఇష్టం లేని వాళ్ళను అందలం ఎక్కించారని విమర్శలు కేసీఆర్ ఎదుర్కొంటున్నారు.

ఇటీవల టీఆర్‌ఎస్ 33 జిల్లాలకు 33 మందిని అధ్యక్షులుగా ప్రకటించింది. ఇష్టారాజ్యంగా సామాజిక న్యాయాన్ని తుంగలోతొక్కి ఐదు శాతం ఉన్న రెడ్లకు 11 జిల్లా అధ్యక్ష పదవులు, ఒక్క శాతం ఉన్న కమ్మలకు మూడు జిల్లా అధ్యక్ష పదవులు, అర శాతం ఉన్న వెలమలకు ఒక్కటి, అర శాతం ఉన్న బ్రాహ్మణులకు ఒక్కటి ఇచ్చి, 136 కులాలతో అరవై శాతం జనాభా గలిగిన బీసీలకు కేవలం 9 జిల్లా అధ్యక్ష పదవులు మాత్రమే ఇచ్చారు. ఒక్క జిల్లా అధ్యక్షుల పదవులే కాదు, పార్టీ పదవులు, పరిపాలన పదవులు కూడా బీసీలకు ఇవ్వలేదు. వారిని పల్లికి మోసే బోయలగా మాత్రమే కేసీఆర్ చూస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

ఇక కేసీఆర్‌ క్యాబినెట్‌ చూస్తే అర శాతం ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రితో కలుపుకుని నలుగురు, ఐదు శాతం ఉన్న రెడ్లు ఆరుగురు, ఒక్క శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్కరు, పదిహేడు శాతం ఎస్సీల నుంచి ఒక్కరు, తొమ్మిది శాతం ఉన్న ఎస్టీల నుంచి ఒక్కరు, పన్నెండు శాతం ఉన్న మైనారిటీల నుంచి ఒక్కరు, అరవై శాతం ఉన్న బీసీల నుంచి ముగ్గురు మాత్రమే ఉన్నారు.

40 ఎమ్మెల్సీ స్థానాల్లో రెడ్లు పదహారుమంది, వెలమలు నలుగురు ఉండగా, బీసీలు ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలలో రెడ్లు 38 మంది, వెలమలు 11 మంది, కమ్మలు 6 , బ్రాహ్మణులు ఒకరు, వైశ్యులు ఒకరు ఉండగా– 60 శాతంగా ఉన్న బీసీల నుండి 23 మంది మాత్రమే ఉన్నారు. పక్కన ఉన్న ఏపీలో జగన్ సర్కార్ మంత్రి పదవిలో ఇతర పదవుల్లో బీసీ ఎస్సీ ,ఎస్టీ మైనార్టీలకు పెద్ద పీట వేస్తుండగా రాజకీయాల్లో సీనియర్ ను , అంటున్న కేసీఆర్ కు బడుగు బలహీన వర్గాలకు , ఉద్యమకారులకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై రగిలి పోతున్నారు .

ఇంత అన్యాయం చట్టసభలలో ఉంది. రాజ్యాంగాన్ని మార్చాలని నిత్యం చెబుతున్న కేసీఆర్ కు బడుగు బలహీనవర్గాలకు టికెట్స్ ఇవ్వడాన్ని ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నకు సమాధానం లేదు . అందువల్ల రాజ్యాంగ సవరణ అంశం టీఆర్ యస్ కు మైనస్ గా మారబోతుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

Related posts

చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదు.. దేవుడిని, ప్రజలను నమ్ముకున్నా: జగన్

Drukpadam

తెలంగాణలో మరో రైతాంగ ఉద్యమం అవసరం ఉంది: కోదండరామ్!

Drukpadam

తుమ్మలపై నిఘానేత్రాలు …రాజకీయ ఉద్దండుడి చూపు ఎటువైపు …?

Drukpadam

Leave a Comment