Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నిజంగానే అంత పలుకుబడి నాకుంటే నేనెందుకు ఓడిపోతానయ్యా!: చంద్రబాబు!

నిజంగానే అంత పలుకుబడి నాకుంటే నేనెందుకు ఓడిపోతానయ్యా!: చంద్రబాబు!

  • మంగళగిరిలో సర్పంచ్ ల అవగాహన సదస్సు
  •  వైసీపీ సర్కారుపై బాబు వ్యంగ్యాస్త్రాలు
  • వైఎస్ వివేకా హత్య నేపథ్యంలో విమర్శలు

మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సర్పంచ్ ల అవగాహన సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ఏం జరిగినా అందుకు తానే కారణమంటున్నారని విమర్శించారు. వివేకా హత్య విషయంలోనూ తనపై ఆరోపణలు చేశారని వివరించారు.

“అవినాశ్ రెడ్డి వచ్చి చూడు.. అని నేనే శివశంకర్ రెడ్డితో చెప్పించా. రెండోరోజు సాక్షిలో ‘నారాసురవధ చరిత్ర’ అని కూడా నేనే రాయించా. ఆ పేపర్ కు కూడా నేనే ఎడిటర్ని. ఏం కథలు అల్లారు… జగన్ రెడ్డి మామకు చెందిన ఆసుపత్రి వాళ్లను కూడా నేనే రమ్మని చెప్పి, వారితో బ్యాండేజీల కుట్లన్నీ వేయించా. ఏమి నాటకాలయ్యా! బాడీని తీసుకెళ్లేందుకు ఓ బాక్సు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ రక్తం కనిపించకుండా ఉండేందుకు పూలు వేయించారని సీఐ చెప్పాడు. ఆ పూలు కూడా నేనే వేయించా.

అక్కడ ఉండేవాళ్లందరూ మన మనుషులే కదా! శివశంకర్ రెడ్డి మన మనిషే, గంగిరెడ్డి మన మనిషే, సునీల్ యాదవ్ మన మనిషే, అవినాశ్ రెడ్డి కూడా మన మనిషే, చివరికి జగన్ రెడ్డి కూడా మన మనిషే! వివేకా కుమార్తె సునీత మన చేతిలో పావే, భారతి రెడ్డి కూడా ఇప్పుడు… ఏం చెప్పాలో నాకైతే అర్థంకావడంలేదు” అంటూ సెటైర్ల వర్షం కురిపించారు. దాంతో, ఆ సదస్సులో సదస్సులో నవ్వులు విరబూశాయి.

అనంతరం చంద్రబాబు తన ప్రసంగం కొనసాగిస్తూ, మనుషులు మాట్లాడేందుకు కూడా హద్దులు ఉంటాయని, ఓ పద్ధతి ఉంటుందని అన్నారు.

సాక్షాత్తు బాబాయి! చంపితే రెండు లాభాలు…! అందుకోసం ఎంతో అందమైన నాటకం రచించారు. ఇలాంటి ఐడియా ఎవరికీ రాదు. స్క్రిప్టు అద్భుతంగా రాశారు. అడ్డుగా ఉన్న వివేకాను అడ్డుతొలగించుకోవాలి. ఎందుకంటే, ఎంపీ సీటు విజయమ్మకో, షర్మిలకో ఇవ్వాలని వివేకా అన్నారని వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారు. అసెంబ్లీలో సీఎం జగన్ తనకు వారిద్దరూ రెండు కళ్లు అని చెప్పారు. ఒక కన్ను మా బాబాయి, మరో కన్ను మా తమ్ముడు (అవినాశ్ రెడ్డి) అని చెప్పాడు. ఈ మాట చెప్పిన పెద్ద మనిషి… సానుభూతి కోసం కూడా ప్రయత్నించాడు. హత్యను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నాపై వేశాడు. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనుకున్నాడు.

ఈ విధంగా చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అదీ ఆయన ధైర్యం, అదీ ఆయన నైజం, అదీ ఆ కుటుంబ చరిత్ర. కోడికత్తి సరే చిన్న నాటకం, బాబాయిది పెద్ద నాటకం. ఏం జరిగినా అందుకు నేనే కారణం అంటున్నారు. వాళ్ల ఇళ్లలో భార్యాభర్తా కాపురం చేసుకోకపోయినా నేనే కారణమంటున్నారు. ఇదెక్కడి న్యాయం!

సీబీఐ విచారణ వేస్తే సీబీఐలోనూ నా వాళ్లే ఉన్నారన్నారు. సినిమా టికెట్ల అంశానికి నేనే కారణమంటున్నారు, ఉద్యోగుల ఆందోళనలకు నేనే కారణమంటున్నారు. నిజంగానే అంత పలుకుబడి నాకుంటే నేనెందుకు ఓడిపోతానయ్యా! ఎన్నికలను కూడా మేనేజ్ చేసుకోలేనా? ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు, ఏది చెప్పి అయినా ప్రజలను మోసం చేయవచ్చు అని అనుకుంటున్నారు” అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.

Related posts

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యత్ …రేవంత్ …!

Drukpadam

రాజకీయాలకు ఆజాద్ గుడ్‌బై? రాష్ట్రపతిగా రానున్నారా ?

Drukpadam

సొంతపార్టీ పైనే ధర్మాన చురకలు …ప్రభుత్వ పెద్దలకు అధికారుల తప్పుడు సలహాలు!

Drukpadam

Leave a Comment