Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ది క‌శ్మీర్ ‘ఫైల్స్‌’పై కేసీఆర్ విసుర్లు!

ది క‌శ్మీర్ ఫైల్స్ పై కేసీఆర్ విసుర్లు ….
-ది క‌శ్మీర్ ఫైల్స్ ఎవ‌రు కోరారు?
-అస‌లు అందులో ఏముంది?
-ఇరిగేష‌న్ ఫైల్స్, ఎక‌న‌మిక్ ఫైల్స్ ఉండాలి
-టీఆర్ఎస్ఎల్పీ భేటీ త‌ర్వాత మీడియాతో కేసీఆర్

క‌శ్మీర్‌లో క‌శ్మీరీ పండిట్ల‌పై జ‌రిగిన అకృత్యాల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ది క‌శ్మీర్ ఫైల్స్ చిత్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌దైన శైలి సెటైర్లు సంధించారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స‌హా బీజేపీ నేతలంతా ఈ చిత్రంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు ఈ చిత్రానికి వినోద ప‌న్ను రాయితీ కూడా ఇచ్చాయి. ఈ చిత్రం చూసేందుకు బీజేపీ కొన్ని బీజేపీ ఫలిత రాష్ట్రాలు సెలవులు కూడా ఇచ్చారు . విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకుంటూ ఈ చిత్రం స‌రికొత్త రికార్డుల దిశ‌గా సాగుతోంది.

సోమ‌వారం నాడు టీఆర్ఎస్ఎల్పీ భేటీ ముగిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించిన కేసీఆర్‌.. ది క‌శ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఆస‌రాగా చేసుకుని కూడా త‌న‌దైన శైలి దాడి కొన‌సాగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ .  “ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ఏముంది? అభివృద్ధి కాంక్షించే ప్ర‌భుత్వం ఉన్న‌ట్లైతే..డవలప్ మెంట్ ఫైల్స్ , ఇరిగేష‌న్ ఫైల్స్‌, ఎక‌న‌మిక్ ఫైల్స్ ఉండాలి. ద క‌శ్మీర్ ఫైల్స్ ను ఎవ‌రు కోరారు? ఈ చిత్రాన్ని ఓట్ల కోస‌మే వాడుకుంటున్నార‌ని ఢిల్లీలో కొంద‌రు క‌శ్మీరీ పండిట్లు చెబుతున్నారు. ఇప్ప‌టిదాకా త‌మ‌కు ఎలాంటి లబ్ధి చేకూర‌లేద‌ని కూడా వారు ఆరోపిస్తున్నారు” అవి అన్ని నాదగ్గర ఉన్నాయి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు ఏమి చేస్తున్నాం , అభివృధ్ధికోసం తీసుకుంటున్న చర్యలు ఏమిటి ? ప్రాజక్టు లు ఏమిటి ? అనేది ప్రజలకు కావాలి కానీ ఎదో ఒక సినిమాను పట్టుకొని ప్రచారం చేసుకోవడం సరైంది కాదని అన్నారు . ఎంత సేపటికి విష ప్రచారాన్ని వెదజల్లటం దానికి ఎవరో కారణం అన్నట్లు చెప్పడం బీజేపీ కి అలవాటుగా మారినిదని కేసీఆర్ మండి పడ్డారు .

Related posts

అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు.. వేడెక్కనున్న రాజకీయాలు!

Drukpadam

జడ్జిలుగా మారిన రాజకీయ నేతలు.. నేతలుగా మారిన జడ్జిలు.. ఎవరంటే..!

Drukpadam

టీషర్టుల గురించి, లోదుస్తుల గురించి నేను మాట్లాడదల్చుకోలేదు: జైరాం రమేశ్

Drukpadam

Leave a Comment