బంజారాహిల్స్‌లో పబ్‌పై దాడి.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ సినీనటి నిహారిక !
-ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై పోలీసుల దాడి
-సమయానికి మించి పబ్‌ను నడుపుతున్నట్టు గుర్తించిన వైనం
-పబ్ యజమానితో పాటు 150 మంది అదుపులోకి
-రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా!
హైద్రాబాద్ లో పబ్ కల్చర్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు . అది అనుమతించినంతవరకు ఒకే కానీ ప్రభుత్వ నిభందనలు పట్టించుకోకుండా కొన్ని పబ్ లు తమ ఇష్టానుసారం నిర్వహించడంతో పాటు అమ్మాయిల ,అబ్బాయిల చేష్టలు శృతిమించుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అరెస్టులు ,శిక్షలు , ఫైన్ లు వారికీ లెక్క ఉండటంలేదు . తాగితందనాలు ఆడటం , ఇందులో ప్రధానంగా ఉంటుంది. పెద్ద పెద్ద కుటుంబాలకు చెందినవారు సైతం పబ్ కల్చర్ కు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల ప్రముఖ బాలి వుడ్ యాక్టర్ షారుఖాన్ తనయుడు ఆర్యన్ ముంబై లోని ఒక పబ్ లో డ్రగ్ కేసులో పట్టుబడ్డ సంగతి తెలిసిందే .గత రాత్రి హైద్రాబాద్ లో లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ లో నిర్ణిత సమయానికి మించి హోటల్ నడపడంతోపాటు ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకంగా 150 మంది అందులో ఉండటంతో పోలీసులు రైడ్ చేసి వారిని పట్టుకున్నారు . అందరిని పోలీసుస్టేషన్ కు తరలించారు. పట్టుబడ్డవారిలో ప్రముఖుల పిల్లలు బుల్లితెర కళాకారులూ ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై పట్టుబడ్డవారు తమను ఎందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారంటూ గొడవడిగితంతో వారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు . వారి విడుదలకు జోరుగా ఫైరవీలు నడుస్తున్నట్లు సమాచారం …
బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై గతరాత్రి దాడిచేసిన పోలీసులు అందులోని ఫుడింగ్ మింగ్ పబ్‌ను నిర్ణీత సమయానికి మించి నడుపుతున్నట్టు గుర్తించారు. దీంతో పబ్ యజమానితో పాటు ఆ సమయంలో అందులో ఉన్న 150 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌తోపాటుసినీనటి నిహారిక పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తమను పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తీసుకొచ్చారంటూ కొందరు యువకులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్‌లోని పబ్‌లో పోలీసులకు పట్టుబడిన వారిలో సినీనటి నిహారిక.. పబ్‌లో డ్రగ్స్ లభ్యం
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ మిగ్ పబ్‌పై గత అర్ధరాత్రి దాటిన అనంతరం పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలు బయటకు వచ్చాయి. పబ్‌లో పోలీసులు కొకైన్, గంజాయి, ఎల్‌ఎస్‌డీ గుర్తించారు. పోలీసులకు పట్టుబడిన వారిలో సినీ నటి నిహారిక కూడా ఉంది. ఆమెతో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చి ఇంటికి పంపినట్లు తెలుస్తోంది.
అంతేగాక, పోలీసులకు చిక్కిన వారిలో మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. పబ్‌లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పబ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు వచ్చారని తెలుసుకున్న వెంటనే కొందరు తమ వద్ద ఉన్న డ్రగ్స్‌ను బయట పడేసే ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. కాగా, పోలీసులకు పట్టుబడిన యువకులు పోలీస్ స్టేషన్‌లో నానా హంగామా చేయడం గమనార్హం. తమను ఎందుకు తీసుకువచ్చారని రచ్చ చేశారు.