రాజకీయంగా ఎదగడంలో జర్నలిస్టు సంఘం నేతలు శ్రీనివాస్ రెడ్డి, దేవులపల్లి అమర్ కీలకం : మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ : తాను రాజకీయాల్లో ఎదగడానికి IJU జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ సహాకారం ఎంతో ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో వీరిద్దరితో పాటు రాధాకృష్ణ సలహాలు, సూచనలు తీసుకునే వాడినని గుర్తుచేసుకున్నారు. గంటల తరబడి చర్చించేవారమని తెలిపారు. వీరి సూచనలు, సలహాలతో ఈ స్థాయికి ఎదిగానని అన్నారు.
వరంగల్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు జర్నలిజం -పరిణామక్రమం సదస్సుకు ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ తో కలిసి
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.
*వరంగల్ లో సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలు జరపడం గర్వకారణం.
*సీఎం కేసీఆర్ ప్రతాపరెడ్డి పేరుమీద యూనివర్సిటీని స్థాపిస్తాం అని మాట ఇచ్చారు.
*జర్నలిస్టులందరు సురవరం ప్రతాపరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి.
*వారు జర్నలిస్టుగా, ప్రజాప్రతినిదిగా, ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేశారు.
*ప్రస్తుతం జర్నలిస్టులు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారు. మీ ఆర్థిక స్థితిగతులు నాకు తెలుసు. మీ సమస్యలు త్వరలోనే తీరుస్తాం.
*మహాకవి బొమ్మెర పోతన సమాధిని 10 కోట్లతో నిర్మిస్తున్నాం.
*యాదాద్రిని అభివృద్ధి చేసుకుంటున్నాం.
సమావేశంలో కవి, రచయిత కసిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆచార్య గిరిజామనోహర్ బాబు, TUWJ(IJU) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వల్లాల వెంకటరమణ, రాజేశ్, రాములు, జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.