Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం అభివృద్ధి గుమ్మం…

ఖమ్మం అభివృద్ధి గుమ్మం
-రూపురేఖలు మారుతున్న ఖమ్మం
-అభివృద్ధి విషయంలో అజయ్ ఆలోచనలు భేష్
-కొత్త కలెక్టరేట్ వరుకు నాలుగు లేన్ల రహదారి
-మునేరు ట్యాంక్ బండ్ గా అభివృద్ధి
-ఖమ్మం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం

ఖమ్మం అభివృద్ధి లో పరుగులు పెడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం . కొంతమంది ఈ అభివృద్ధి ఏమి అభివృద్ధి అంటున్నారు. ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించకుండా , వారి జీవన ప్రమాణాలు పెరగకుండా పైపై పూతల ద్వారా రంగులు అద్దటం అభివృద్ధి అవుతుందా ?  అంటూ విమర్శలు చేస్తున్నారు. కాని ఖమ్మం చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది . ఇది పైకి చెప్పక పోయిన రాజకీయాలకు అతీతంగా అందరు అంగీకరించాల్సిందే . స్థానిక ఎమ్మెల్యే గా రాష్ట్ర మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ ఖమ్మం అభివృద్ధిపై అకుంఠిత దీక్షతో పని చేస్తున్నారు. ఖమ్మం ను అభివృద్ధి చేయాలనే కసి ఆయనలో కనిపిస్తుంది.వెంట పడి అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. స్వయంగా పర్వవేక్షణ చేస్తున్నారు. నిరంతరం అధికారులతో కాంట్రాక్టర్లతో సమీక్షలు జరుపుతున్నారు. వ్యక్తిగా ఆయనతో ,లేదా ఆయన పార్టీతో విభేదించవచ్చు కాని ఆయన అభివృద్ధి పనులకు సెల్యూట్ చేయాల్సిందే . ఆయనలో ఉన్న పట్టుదలతో వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఆయన కృషితోనే ఖమ్మ రూపురేఖలు మారుతున్నాయని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . గతంలో ఉన్న ఖమ్మం కు ఇప్పటి ఖమ్మం కు బెరీజ్ వేసుకొని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో అభివృద్ధి జరగలేదా ? అంటే జరిగింది. కాని ఇంత పెద్ద వెత్తున జరిగిన సందర్భం లేదు. 200 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. ఇప్పటికే ముస్తఫా నగర్ , ఇల్లందు రోడ్ , రఘునాథపాలెం , నగరంలో సెంట్రల్ లైటింగ్ , డివైడర్ల ఏర్పాటు ,అధునాతమైన మరుగుదొడ్లు , లకారం ట్యాంక్ బండ్ ,లాకారంపై ఊయల బ్రిడ్జి ఏర్పాటు, వాకర్స్ పారడైజ్ , మోడరన్ బస్ స్టేషన్ కాంప్లెక్స్ , ఐ టి హబ్ , కూరగాయల మార్కెట్ , కాల్వ ఒడ్డున నిర్మించిన వైకుంఠధామం లాంటివి ఖమ్మం నగరానికి కొత్త శోభ తెచ్చాయి.నగరమంతా కలర్ ఫుల్ గా మారింది. ఖమ్మం నగరం శరవేగంగా పెరుగుతుంది అందుకు తగ్గట్లుగా అభివృద్ధిని మంత్రి అజయ్ పరుగులు పెట్టిస్తున్నారు.

రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగర జాబితాలో ఖమ్మం చేరింది . విద్య, వైద్య రంగాలలో ముందున్న ఖమ్మం , ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోనూ దూసుకు పోతుంది.ఈ అభివృద్ధికి కారణం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ,ముఖ్యమంత్రి కేసీఆర్ అని, తాను ఖమ్మం కోసం ఏది అడిగినా వారు స్పందించి వెంటనే నిధులు విడుదల చేయటం వల్లనే ఇంత అభివృద్ధి చేయగలిగానని అంటున్నారు మంత్రి అజయ్ . 2021 -2022

 

రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఖమ్మం నగరానికి 150 కోట్ల నిధులు ప్రత్యేకంగా కేటాయించారని అందుకు ముఖ్యమంత్రికి ఖమ్మం రుణపడి ఉంటుందన్నారు . ఇంకా ఖమ్మం కోసం మరిన్ని నిధులు తెచ్చి మరింతగా అభివృద్ధి చేయాలనే తపన ఆయన లో కనిపిస్తుంది. నిజంగా ఇంత కాలానికి ఖమ్మం దశ తిరిగింది అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఖమ్మం మునేరును అభివృద్ధి చేసే పథకం ముఖ్యమంత్రి స్వయంగా మంత్రితో మాట్లాడారు. ఒక ఆహ్లదకరమైన వాతావరణం కలిగించాలా మునేరు పక్కన ఒక బండ్ నిర్మించి గార్డెన్ ఏర్పాటు చేస్తే నగర ప్రజలకు ,పిల్లలకు ఒక పిక్నిక్ స్పాట్ లగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడున్న బై పాస్ రోడ్ రద్దీ పెరగటం పెరుగుతున్న ట్రాఫిక్ ను తట్టుకునేందుకు ఖమ్మం కు రింగ్ రోడ్ అవసరం ఉంది . దీనికోసం ఒక ప్లాన్ కూడా రూపొందించారు. మరో స్టేడియం అవసరం ఉంది . ఖమ్మం చుట్టూ పక్కల కూడా ట్రాఫిక్ నియంత్రించేందుకు నాలుగు లేన్ల రహదార్లు అవసరం . కొత్త కలెక్టరేట్ దారిని నాలుగు లేన్ల గా చేసేందుకు నిధులు కూడా మంజూరు అయ్యాయి. ఇక మద్దుల పల్లి నుంచి పొన్నేకల్ గ్రీన్ ఫీల్డ్ హైవే వరకు మరొక కి.మీ రహదారి నాలుగు లేన్ల గా చేసేందుకు కూడా మంత్రి చేసిన ప్రతిపాదనలకు అంగీకారం వచ్చింది. నిధులు కూడా మంజూరు అయ్యాయి. ఖమ్మం నగరంలో దోమలబెడ అధికంగా ఉంది .దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మాత్రమే పరిస్కారం దాన్నికూడా సాధించాలనే ఆలోచన ఆయనలో ఉంది. ఖమ్మం రూపురేఖలు మారుస్తున్న మంత్రి అజయ్ పై హర్షతి రేకాలు వ్యక్తం అవుతున్నాయి. అభివృద్ధి విషయంలో అజయ్ ఆలోచనలు భేష్ అంటున్నారు.

Related posts

మళ్ళీ కేంద్రంలో బీజేపీదే అధికారం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ …

Drukpadam

యూపీ ఎన్నికల్లో మాయావతి కూడా పోటీకి దూరం …

Drukpadam

కర్ణాటక విజయం …ఖమ్మం లో కాంగ్రెస్ సంబరాలు…

Drukpadam

Leave a Comment