Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

టక్కరి యువతి బ్లాక్ మెయిల్.. యువకుడి ఆత్మహత్య

టక్కరి యువతి బ్లాక్ మెయిల్.. యువకుడి ఆత్మహత్య
-మాటలతో కవ్వించి, నగ్నంగా మార్చి బెదిరించిన వైనం
-ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూసి రిప్లై ఇచ్చిన యువకుడు
-వీడియో కాల్‌లో నగ్నంగా మాట్లాడుతూ యువకుడిని ట్రాప్‌లోకి లాగిన యువతి
-ఆపై డబ్బుల కోసం వేధింపులు
టక్కరి యువతి మత్తెక్కించే మాటలు నమ్మి చిత్తైన యువకుడు ఆమె వలలో చిక్కి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు.

కొన్ని రోజుల క్రితం మొబైల్‌కు వచ్చిన ఓ మెసేజ్ అతడిని ఆకర్షించింది. తాను ఒంటరి మహిళనని, మీతో చాటింగ్ చేయాలనుకుంటున్నానని ఉన్న ఆ మెసేజ్‌కు అతడు వెంటనే రిప్లై ఇచ్చాడు. ఆ వెంటనే అటునుంచి ఓ యువతి వీడియో కాల్‌చేసి నగ్నంగా మాట్లాడింది. అక్కడితే ఆగక తన మత్తెక్కించే మాటలతో అతడిని కూడా నగ్నంగా మార్చేసింది.

ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆ వీడియో సంభాషణను రికార్డు చేసిన ఆమె డబ్బుల కోసం డిమాండ్ చేసింది. అడిగినంత ఇవ్వకుంటే ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామంటూ ముఠా సభ్యులతో కలిసి యువకుడిని బెదిరించింది. దీంతో ఏం చేయాలో పాలుపోని యువకుడు తన ఖాతాలో ఉన్న రూ. 24 వేలను వారికి ట్రాన్స్‌ఫర్ చేశాడు.

అయినప్పటికీ వారి నుంచి వేధింపులు ఆగలేదు. ఇంకా డబ్బులు కావాలని వేధిస్తుండడంతో నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లాడు. ఆ తర్వాతి రోజు ఉదయం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని నిజామాబాద్ ఆసుపత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

నాలుగేళ్లుగా ఇంటర్ విద్యార్థి అదృశ్యం …తగిన మైకంలో కక్కేసిన నిందితుడు !

Drukpadam

సీఎం జగన్ బంధువులు భూకబ్జా ఆరోపణలపై స్పందించిన సీఎంఓ!

Drukpadam

ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్ శరీరంపై 500కుపైగా గాయాలు

Ram Narayana

Leave a Comment