Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మిత్ర దేశం చైనాకు షాకిచ్చిన పాక్ కొత్త ప్రధాని..

మిత్ర దేశం చైనాకు షాకిచ్చిన పాక్ కొత్త ప్రధాని.. చైనా–పాక్ ఆర్థిక కారిడార్ అథారిటీ రద్దు.. చైనా రియాక్షన్ ఏంటంటే..!

  • ఉత్తర్వులు జారీ చేసిన పాక్ ప్రణాళికా మంత్రి
  • పనికిమాలిన సంస్థ అంటూ వ్యాఖ్య
  • డబ్బులన్నీ వృథా అయ్యాయని అసహనం 
  • ఇప్పటికే సగం డబ్బు వ్యయం చేశామన్న చైనా

మిత్రదేశం చైనాకు పాకిస్థాన్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ పెద్ద షాకిచ్చారు. చైనా–పాకిస్థాన్ ఆర్థిక నడవా (సీపీఈసీ) ప్రాధికార సంస్థను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదో పనికిమాలిన సంస్థ అని పాక్ ప్రణాళికా శాఖ మంత్రి అషన్ ఇక్భాల్ వ్యాఖ్యానించారు. దాని వల్ల డబ్బులన్నీ వృథా అయ్యాయని, ప్రాంతీయ అనుసంధానత దెబ్బతిన్నదని అన్నారు.

చైనాకు చెందిన విద్యుదుత్పత్తి సంస్థలు 1,980 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే యూనిట్లను మూసివేశాయన్న కథనాల నేపథ్యంలోనే సీపీఈసీ అథారిటీనీ రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించాలంటూ ఇక్భాల్ ఆదేశాలిచ్చారు. ఆ ఆదేశాలకు ప్రధాని షెహబాజ్ ఆమోదం తెలుపడంతో ఉత్తర్వులను జారీ చేశారు.

చైనాలోని షిన్ జియాంగ్ ప్రావిన్స్ నుంచి పాక్ లోని బలూచిస్థాన్ పరిధిలోని గదర్ ఓడరేవు మధ్య మౌలిక వసతులు, ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 2019లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు రూ.4.5 లక్షల కోట్ల మేర ప్రాజెక్టులనుద్దేశించి అథారిటీని నియమించారు. అయితే, ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం సగానికి పైగా ఖర్చు చేశామని చైనా వాపోతోంది. ఇప్పటికిప్పుడు ప్రాజెక్టును రద్దు చేయడమేంటని అసహనం వ్యక్తం చేస్తోంది.

Related posts

టీఆర్ఎస్ ఎంపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు…

Drukpadam

ఏపీ ప్రభుత్వానికి రూ.120 కోట్ల జరిమానా వడ్డించిన ఎన్జీటీ…

Drukpadam

గుజరాత్ లోని ప్రాచీన నగరం ‘ధోలావిరా’కు యునెస్కో గుర్తింపు… ప్రధాని మోదీ హర్షం!

Drukpadam

Leave a Comment