ఖమ్మం లో మంత్రి ఆగడాలు …కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ…
-సాయి గణేష్ మృతికి వేధింపులే కారణం
-మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
-తెలంగాణాలో మరో పార్టీ ఎదగకుండా కేసీఆర్ కుట్రలు
-సాయి గణేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు
-కుటుంబసభ్యులకు పరామర్శ
-బీజేపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా
బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్యకు కారణమైనవారిని వదిలిపెట్టమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు మాఫియాగా మారి ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. సాయిగణేష్ కుటుంబసభ్యులను కిషన్ రెడ్డి పరామర్శించారు.
ఖమ్మం లో రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ ఆగడాలు ఎక్కువయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల ఆత్మహత్యచేసుకొని మరణించిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి పరామర్శించారు . కుటుంబసభ్యులను జరిగిన పరిణామాలకు సంబందించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు .పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు .
అంతకు ముందు హైద్రాబాద్ నుంచి వచ్చిన కిషన్ రెడ్డికి ఖమ్మం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఘన స్వాగతం పలికారు . అక్కడ స్థానికులను కలుసుకున్నారు . ఈ సందర్భంగా బానోత్ భద్రునాయక్ తనపై పెట్టిన రౌడీ షీట్ గురించి కేంద్రమంత్రికి వివరించారు. తనకు న్యాయం జరిగేలా కృషి చేయాలనీ వేడుకున్నారు . అనంతరం సాయి గణేష్ ఇంటికి వెళ్లి కుటుంసభ్యులతో మాట్లాడారు .
ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ కుటుంబాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం పరామర్శించేందుకు గతంలో ఒక కేంద్రమంత్రి రావడం , ఇప్పుడు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రావడం అనేకమంది బీజేపీ నేతలు వచ్చి గణేష్ కుటుంబాన్ని ఓదార్చడం తో ఇది రాష్ట్ర వ్యాపిత సమస్యగానే కాకుండా దేశ వ్యాపిత సమస్యగా మారింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తోపాటు , బీజేపీ తమిళనాడు సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే ధర్మారావు , కిషన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి , తదితరులు ఉన్నారు . నాయకులూ అంతా సాయిగణేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు .ఆత్మహత్య గల కారణాలను అడిగి తెలుసుకున్నారు . పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు . బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ. బీజేపీ యువ కార్యకర్తను కోల్పోయిందని అవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది. మరో పార్టీ ఎదగకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారు . ఖమ్మంలో మంత్రి ఆగడాలు హద్దుమీరుతున్నాయి . సాయిగణేశ్ ను అనేక రకాలుగా వేధింపులకు గురిచేశారు. అతడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి అని కిషన్ ఫైరయ్యారు. జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిందేనని అన్నారు .
సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్, ఇతర పోలీసు అధికారులు జైలుకు వెళ్లకతప్పదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. తెలంగాణలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రైస్ మాఫియా పెరిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ప్రతిపక్ష పార్టీలు వార్డుల్లో ఖర్చు చేయడం లేదని, అనేక సర్వేలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వస్తున్నాయన్నారు.