Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

రేపే హాట్టహాసంగా ఐపీఎల్ ఫైనల్ … ముస్తాబైన అహమ్మదాబాద్ లోని మోడీ స్టేడియం!

ఐపీఎల్ ముగింపు వేడుకకు ఏఆర్ రెహమాన్, రణవీర్ సింగ్
-అహ్మదాబాద్ స్టేడియంలో 29 రాత్రి 8 గంటల నుంచి ఫైనల్స్
-మ్యాచ్ ముగిసిన తర్వాత 45 నిమిషాల పాటు కార్యక్రమం
-మాజీ కెప్టెన్లు, పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం

ఇప్పటివరకు ఉర్రుతలు ముగించిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు గుజరాత్ లోని ప్రధాని నరేంద్ర మోడీ పేరుతొ నిర్మించిన స్టేడియం ముస్తాబైంది. క్రీడా పండితుల అంచనాలు తలకిందులు చేస్తూ ఎవరు ఊహించని విధంగా గుజరాత్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. అదేవిధంగా మొదటి ఐపీఎల్ లో కప్పు సాధించిన రాజస్థాన్ రాయల్స్ తిరిగి ఫైనల్ లోకి అడుగు పెట్టింది. ఇద్దరి మధ్య చివరి రసవత్తర పోరు జరగనున్నది …అందుకు క్రికెట్ అభిమానులు అంట ఎదురు చూస్తన్నారు.

కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్, మరో జట్టు రాజస్థాన్ రాయల్స్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుది పోరులో నెగ్గి, ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ షేన్ వార్న్ కు ఘనమైన నివాళి అర్పించాలని రాజస్థాన్ రాయల్స్ జట్టు పట్టుదలతో ఉంది. ఐపీఎల్ 2008లో మొదలు కాగా, తొలి సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షేన్ వార్న్ కెప్టెన్ గా పనిచేసి తొలి కప్పు తీసుకొచ్చి పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ రాజస్థాన్ జట్టు కప్పు గెలిచింది లేదు.

ఐపీఎల్ ఫైనల్స్ అనంతరం 45 నిమిషాల పాటు కార్యక్రమానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇందులో పాల్గొననున్నారు. అలాగే, ఝార్ఖండ్ కు చెందిన ప్రముఖ ఛౌ డ్యాన్స్ కూడా ఉంటుందని సమాచారం. ఇందుకోసం బీసీసీఐ 10 మంది సభ్యుల ఝార్ఖండ్ ఛౌ డాన్స్ బృందాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా, టీమిండియా మాజీ కెప్టెన్లు ముగింపు వేడకకు హాజరుకానున్నారు. 2019 సీజన్ నుంచి ఐపీఎల్ ముగింపు వేడుక ఇప్పటి వరకు సాధ్యపడలేదు.

Related posts

2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో కీలక మార్పులు… కొత్తగా 5 ఆటలకు చోటు

Ram Narayana

మూడో టెస్టులో చిత్తుగా ఓడిన భారత్…

Drukpadam

కుల్దీప్ స్పిన్ ఉచ్చులో పాక్ విలవిల… 228 పరుగులతో భారత్ ఘనవిజయం

Ram Narayana

Leave a Comment