ఢిల్లీలో అభిమానుల కోలాహలం
ఖమ్మం ఎం పి నామ నాగేశ్వరరావు తో కలిసి ఢిల్లీ చేరుకున్న వద్ధిరాజు
టీఆర్ యస్ రాజ్యసభ సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వద్ధిరాజు రవిచంద్ర రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రవిచేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి కొద్దిమందినే అనుమతించనున్నారు. అయితే ఆయన అభిమానులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున ఢిల్లీకి తరలివచ్చారు. ఖమ్మం ,వరంగల్ జిల్లాలనుంచే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి ఆయన హితులు, సన్నిహితులు పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం.
టీఆర్ యస్ లోకసభ పక్షనేత ఖమ్మం ఎం పి నామ నాగేశ్వరరావు తో కలిసి వద్ధిరాజు రవిచంద్ర హైద్రాబాద్ నుంచి ఢిల్లీ కి వెళ్లారు. ఆయన వెంట కుటుంబసభ్యులు కూడ ఉన్నారు. వారికి లోకసభ టీఆర్ యస్ పక్షనేత నామ నాగేశ్వరరావు నివాసంలో అతిధ్యం ఇచ్చారు.