సీఎం జగన్ కొత్త స్ట్రాటజీ …
తిరుపతి పార్లమెంటు ఓటర్లకు సీఎం జగన్ లేఖ
ఈ నెల 17న తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక
తమ పాలన గురించి లేఖలో ప్రస్తావించిన సీఎం జగన్
పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివరణ
విపక్షాల ప్రస్తావన లేకపోవడం విశేషం
ఈ నెల 14న సీఎం జగన్ తిరుపతి రాక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త స్ట్రాటజీ తో వెళ్లేందుకు సిద్దమైనట్లు ఉన్నారు. అందుకే తిరుపతి పార్లమెంట్ కు ఉపఎన్నికలు జరుగుతున్నా నేపథ్యంలో ప్రభుత్వం అమలు జరుపుతున్న పథకాలు గురించి ఓటర్లకు లేఖ రాశారు.ఇందులో ఎక్కడ ప్రతిపక్షాలపై ఎలాంటి విమర్శలు లేకపోవడం విశేషం .
తిరుపతి పార్లమెంటు స్థానానికి ఈ నెల 17న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో, వైసీపీ అభ్యర్థికే ఓటేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలోని ఓటర్ల కుటుంబాలకు లేఖ రాశారు. తన లేఖలో విపక్షాలపై విమర్శల జోలికి వెళ్లని సీఎం జగన్… కేవలం తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధినే వివరించారు . ఈ 22 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలోని కుటుంబాలకు తమ పథకాలను ఏ విధంగా అందిస్తున్నదీ విశదీకరించారు. కాగా, సీఎం జగన్ ఈ నెల 14న తిరుపతి రానున్నారు. రేణిగుంట మండలం యోగానంద కాలేజి సమీపంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
previous post