Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం సంకల్ప సభలో కేసీఆర్ పై షర్మిల నిప్పులు

ఖమ్మం సంకల్ప సభలో కేసీఆర్ పై షర్మిల నిప్పులు
-కల్వకుంట్లుగా ఫ్యామిలీకి రాష్ట్రం బానిస అయిందా ?
-దొరగారు నంది అంటే నంది… పంది అంటే పంది
-ఎమ్మెల్యే,ఎంపీలకు అపాయింట్మెంట్ లేదు
-అంతా భజన బ్యాచ్ నే
-పాలనంతా బంధువర్గానిదే
-స్వరాష్ట్ర ఫలాలు ప్రగతి భవన్ గేట్ దాటటం లేదు
-బంగారు తెలంగాణ ఏమైంది
-ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక యువకుల ఆత్మహత్యలు
-రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ అగ్రస్థానం
-శాంతి భద్రతలు మృగ్యం
– కొత్తగా సంక్షేమ పథకాలు లేవు
ఖమ్మం లో జరిగిన షర్మిల సంకల్పసభలో కేసీఆర్ పై షర్మిల నిప్పులు చెరిగారు. ఒక్కో పథకం వైఫల్యాలు గురించి చెపుతు ఇదేనా బంగారు తెలంగాణ అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆత్మగౌరం కోసం తెచ్చుకున్న తెలంగాణ దొరగారి కాలి చెప్పుకింద నలిగి పోతుందంటూ కేసీఆర్ విధానాలను తూర్పార బట్టారు . ఆత్మగౌరహం కోసం తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల ఫ్యామిలీకి బానిస అయిందా ? అని ప్రశ్నించారు . ఇదేనా తెలంగాణ ప్రజలు కోరుకొన్నది అంటు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో పరిపాలన ఉందా? సచివాలయం లో అడుగు పెట్టని సీఎం ఎవరైనా ఉన్నారా? ఉన్న సచివాలయాన్ని కూల్చివేశారు ఎక్కడ పరిపాలన సాగుతుందో ఏ అధికారి ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి . తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు అయింది ఒక్క కొత్త రేషన్ కార్డు లేదు. సంక్షేమ పథకాలు అమలు సరిగా లేవు . అసలు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచనలేదు . దేశంలో ఎక్కడ లేని రైతుల ఆత్మహత్యలు తెలంగాణాలో జరుగుతున్నాయి. శాంతి భద్రతలు అదుపులోలేవు . పోడుభూములు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వడం లేదు సరికదా ఒక గిరిజన మహిళను బట్టలు విప్పి కొడుతున్నా ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్లు చూస్తుంది. న్యాయవాది దంపతులను నడిబజారులో నరికి చంపారు. నీళ్లు , నిధులు , నియామకాలు అన్నారు అవి అన్ని కేసీఆర్ కుటుంబానికే దక్కాయని ప్రజలు భావిస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే రాష్ట్రం లో రాజన్న సంక్షేమ రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం రెండు ,రెండుకాళ్లుగా చూశారు. కష్టాలలో ఉన్న పేదల భాదలు తీర్చేందుకు ప్రజాదర్బార్ పెట్టారు . ఆపన్నులకు నేనున్నాననీ భరోసా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ తెచ్చారు .ఉచిత విద్యుత్ ఇచ్చారు. అందరికి సాచురేషన్ పద్దతిలో పెన్షన్ లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఒక్క రేషన్ కార్డు గాని పెన్షన్ గాని లేదు . దొరగారు చెప్పిందే వేదం . ఎవరి అభిప్రాయాలూ తీసుకోరు. ఆయన నంది అంటే నంది …పంది అంటే పంది . ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని జీతాలు పెంచారు ఉపాధ్యాయులను బెదిరించి ఓట్లు వేయించుకున్నారు. ఎమ్మెల్యే లకు ఎంపీలకు అపాయింట్ మెంట్ లేదు. మంత్రుల మాటలు పట్టించుకోరు భజన బ్యాచ్ కే పదవులు .దొరగారి బందు వర్గం చేతుల్లో రాష్ట్రం బందీ అయిందని షర్మిల ధ్వజం ఎత్తారు . కోటి ఎకరాలు నీరు అన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాణహిత -చేవెళ్ల ,ప్రాజక్టు డిజైన్ మార్చి తలా తోక ఉంచి మధ్యలో కట్ చేశారు. 38 వేల కోట్లతో పూర్తీ కావలిసిన ప్రాజక్టు లక్ష 30 కోట్లు చేశారు. అంతా అవినీతి మయం. రుణమాఫీ లేదు రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. కౌలు రైతులు రైతే కాదంటున్నారు. రైతుల పేరుతొ జేబులు నింపుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ముస్లింలకు 12 శారం రిజర్వేషన్లు అన్నారు. మహిళలకు జీరో పర్సెంట్ రుణాలు అన్నారు .అవి 12 .5 శాతం వసూల్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఖాళీల భర్తీ లేదు . ఇస్తామన్న నిరుద్యోగ భృతి అన్న ఇంతవరకు అమలు లేదు . ఉద్యోగాల నోటిఫికేషన్ లేక సునీల్ నాయక్ అనే విద్యార్ధి మరణించారు. ప్రజల కోసం ప్రజల తరుపున పోరాడే పార్టీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారితరుపున ప్రశ్నించేందుకే పార్టీ పెడుతున్నామని ఆమె సభికుల హర్షధ్వనాల మధ్య ప్రకటించారు. లక్ష 91 వేల ఉద్యోగాలకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ,నోటిఫికేషన్ల కోసం చేస్తున్న ఆత్మహత్యలు ఆగి పోవాలని కోరుతూ హైద్రాబాద్ ఈ నెల 14 నుంచి 3 రోజులు దీక్ష చేపట్టబోతునట్లు ప్రకటించారు. దానికి కొనసాగింపుగా అన్ని జిల్లాలో నోటిఫికేషన్ వచ్చే వరకు దీక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. ఒక్క నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవద్దని పిలుపునిచ్చారు.

 

Related posts

దేశం గర్వించేలా సచివాలయాన్ని నిర్మించాలి: కేసీఆర్…

Drukpadam

పని చేయకుండా దగ్గరకొచ్చి కబుర్లు చెప్పే వారిని ఉపేక్షించను: చంద్రబాబు హెచ్చరిక!

Drukpadam

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోని కేసీఆర్!

Drukpadam

Leave a Comment