జులై 8 న పార్టీ ప్రకటన … వైయస్ షర్మిల
-నేను తెలంగాణ బిడ్డనే … ఇక్కడే చదివాను
-నా కొడుకు ,కూతురు ఇక్కడే పుట్టారు
-ఇక్కడ వారి రుణం తీర్చుకొనేందుకు పార్టీ
-ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని హైద్రాబాద్ లో 3 రోజుల దీక్ష
– నిరుద్యోగులకు అండగా ఉంటా … ఆత్మహత్యలకు పాల్పడవద్దు
-చేయి చేయి కలుపుదాం … రాజన్న రాజ్యం తెచ్చుకుందాం
నేను తెలంగాణ బిడ్డనే నా కొడుకు, కూతురు ఇక్కడే పుట్టారు .నేను ఇక్కడే చదుకున్నారు. అందుకే తెలంగాణ ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నానని వైయస్ షర్మిల ప్రకటించారు. ఖమ్మం లో జరిగిన సంకల్ప సభలో ఆమె పదునైన పదజాలంతో రాష్ట్రంలో అధికారం లో ఉన్న టీఆర్ యస్ పై విమర్శలు గుప్పించారు . అధినేత కేసీఆర్ పై ఘాటైన పదజాలంతో ధ్వజం ఎత్తారు. తెలంగాణాలో పార్టీ పెట్టడం పై ఆమె మాట్లాడుతూ బరా బర్ పార్టీ పెడతా . తెలంగాణాలో నిలబడతా,తెలంగాణ ప్రజలకోసం కొట్లాడతా అవకాశం ఇస్తే ప్రజలకు నమ్మకంగా ,చిత్తశుద్ధితో పనిచేస్తా . జులై 8 రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ జెండా ,పార్టీ పేరు ఎజెండా ప్రకటిస్తానన్నారు.రాజన్న సంక్షేమ రాజ్యం తెలంగాణాలో కావాలి అందుకు అందరం చేయి చేయి కలుపుదాం అని షర్మిల పిలుపు నిచ్చారు.
తెలంగాణ కోసం నిలబడతా ,తెలంగాణకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తా , అడ్డుకుంటా , మనది తెలంగాణ ప్రజల పార్టీ నేటి కార్యకర్తలే రేపటి నాయకులూ , అధికారం ఉందని భయపడాల్సిన పనిలేదు, డబ్బులకు లొంగద్దు , ఆత్మగౌరవ తెలంగాణ కోసమే కొత్త పార్టీ పెడుతున్నాం అని ఉద్యేగంగా చెప్పారు.
కేసీఆర్ ను నిలదీసే శక్తి ఏ పార్టీకి లేదు
కేసీఆర్ ను ప్రజల తరుపున నిలదీసే శక్తి ఏ పార్టీకి లేదని షర్మిల విమర్శించారు . అందరు తమ స్వార్ధం కోసం పరస్పరం సహకరించుకోవటమే తప్ప ప్రజల తరుపున పోరాడటం లేదన్నారు. ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చటంలో కేసీఆర్ విఫ్లమైయ్యారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఒడ్డు దాటినదాకా ఓడ మల్లయ్య ,ఒడ్డు దాటినంక బోడ మల్లయ్య అంటాడు . కాంగ్రెస్ కేసీఆర్ ను నిలదీయదు సరికదా ఎమ్మెల్యే లను గెలిపించి టీఆర్ యస్ లోకి పంపించే సప్లయ్ కంపెనీ గా మారింది .అది కేసీఆర్ కు అమ్ముడు పోయింది . బీజేపీ మతతత్వాన్ని రెచ్చగొట్టి బతకాలను కుంటుంది. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు జరపదు. ఖాజీ పేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు, పసుపు బోర్డు లేదు. స్పసీ బోర్డు ఇచ్చారు తాటాకు ఇవ్వమంటే ఈతకు ఇచ్చారు.పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు . పైకి ప్రశ్నిస్తున్నట్లు అన్ని పార్టీలు నటిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజల తరుపున మాట్లాడే బలమైన గొంతుక కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజల తరఫున పోరాడేందుకే కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించు కున్నట్లు తెలిపారు
నేను ప్రజాబాణాన్ని !
సింహం సింగిల్ గానే వస్తుంది .నేను ఎవరో చెపితే రాలేదు . టీఆర్ యస్ చెబితేనో , బీజేపీ అడిగితేనో కాంగ్రెస్ పంపితేనో వచ్చినదాన్ని కాదు ప్రజా బాణాన్ని తెలంగాణ ప్రజల కోసమే వచ్చాను ,ఇతర పార్టీల కింద పని చేయనని స్పష్టం చేశారు.