బీహార్‌లో మజ్లిస్‌కు షాక్.. ఆర్జేడీలో చేరిన నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు!
-2020 ఎన్నికల్లో సత్తా చాటిన మజ్లిస్ పార్టీ
-ఏకంగా 5 సీట్లను గెలచుకున్న ఎంఐఎం
-తేజస్వీ సమక్షంలో ఆర్జేడీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు
-ఇక మజ్లిస్‌లో మిగిలింది ఒక్క ఎమ్మెల్యేనే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారని ఎంఐఎం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే … బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పడాల్సిన ఓట్లను చీల్చడం ద్వారా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ కూటమికి మేలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అనేక స్థానాల్లో ఆర్జేడీ విజయావకాశాలపై ఎంఐఎం దెబ్బతీసిన సంగతి తెలిసిందే . ఇప్పుడు అదే ఎంఐఎం కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలలో నలుగురు ఆ పార్టీ కు గుడ్ బై చెప్పి ప్రతిపక్ష ఆర్జేడీతో చేరడం ఆసక్తికర పరిణామం .
తెలంగాణకు చెందిన మజ్లిస్ పార్టీ (ఏఐఎంఐఎం)కు ఉత్తర భారతంలో భారీ షాక్ తగిలింది. 2020లో బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సత్తా చాటిన మజ్లిస్ ఏకంగా 5 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండేళ్లు తిరక్కుండానే… ఆ ఐదురుగు మజ్లిస్ ఎమ్మెల్యేల్లో నలుగురు ఆర్జేడీలో చేరిపోయారు. ఈ మేరకు మజ్లిస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ సమక్షంలో ఆర్జేడీలో చేరారు.
మజ్లిస్‌ను వదిలి ఆర్జేడీలో చేరిన వారిలో ముహ్మద్ ఇజార్ అస్ఫీ (కొచ్చాడామమ్), షహనాజ్ అలం (జోకిహర్), సయ్యద్ రక్నుద్దీన్ (బైసీ), అజార్ నయీమీ (బహదుర్గుని)లు ఉన్నారు. ఆర్జేడీలో ఈ నలుగురు చేరిపోవడంతో ఇక మజ్లిస్‌లో అమౌర్ నుంచి విజయం సాధించిన అఖ్తరుల్ ఇమాన్ ఒక్కరు మాత్రమే మిగిలారు.