తెలంగాణాలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా జానారెడ్డి …
-సాగర్ లో గెలిస్తే కాంగ్రెస్ లో కింగ్ జానారెడ్డే !
-ప్రతిపాదించిన ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
-కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పంచాయతీ తీరినట్లేనా
-అధిష్టానం అంగీకారమే తరువాయా?
నాగార్జున సాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ లో ని ఒక పంచాయతీని తీర్చినట్లేనా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయపండితులు . తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే జానారెడ్డి ముఖ్యమంత్రి అవుతారని టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, భోవనగిరి ఎంపీ పి సి సి రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు ప్రకటించారు. సాగర్ ఉపఎన్నికల్లో పోటీచేస్తున్న జానారెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ముఖ్యనేతలు ఇరువురి జానారెడ్డినే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటిచడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిన ఇంతకూ మించి మరో మార్గంలేదు అనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. మరో విషయం కూడా వారు సాగర్ సభల్లో చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న రోజుల్లో జానారెడ్డిని అధిష్టానం పిలిచి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పింది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం విని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలే ఆశ్చర్యానికి గురయ్యారు . నాకు ముఖ్యమంతి పదవికన్నా తెలంగాణ ఇవ్వడమే ముఖ్యం అనే స్పష్టం చేశారు. అంతకు ముందు హైద్రాబాద్ లోని జానారెడ్డి ఇంట్లోనే అన్ని పార్టీల నేతల సమావేశం జరిగి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది . దానికి కోదండరాం ను చైర్మన్ గా నియమించారు. అందుకే జానారెడ్డి సోనియా దగ్గర పట్టుబట్టి తెలంగాణ ఇప్పించారని నేతలు చెబుతున్నారు. సాగర్ లో కాంగ్రెస్ గెలుపు కన్నా జానారెడి గెలుపు కాంగ్రెస్ లోని అనేక పంచాయతీలకు పరిస్కారం లభించే ఆవకాశం ఉంది. ఆయన గెలిసే అధిష్టానం ఆయన చెప్పిందే వేదంగా స్వీకరించే ఆవకాశం ఉంది. అందువల్ల సాగర్ గెలుపు జానారెడ్డిని కింగ్ ను చేస్తుందనటంలో ఎలాంటి సందేహంలేదు . కాంగ్రెస్ పార్టీ లో అందరు నాయకులే అందరు ముఖ్యమంత్రి అభ్యర్థులే కాకపోతే అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోగలగాలి . అందుకు తాపత్రయపడతారు. ఇందులో కాస్త భాష పరిజ్ఙానం ,హిందీ ,ఇంగ్లీష్ మీద పట్టు,ఉంటె చాలు . వారు అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నించి మంత్రులు , ముఖ్యమంత్రిలు అవుతుంటారు. అయితే ఇది గతంలో ఉండేదని ఇప్పుడు ఆ పప్పులు ఉడకటంలేదని అంటున్నారు కొందరు నేతలు . గతంలో లాగా పైరవీలకు తావులేదు . ఇక్కడ దమ్ము సత్తా ఉన్న నాయకులూ , జనంలో పలుకు బడి ఉన్న వారిని మాత్రమే రాష్ట్రాలలో నాయకులుగా ప్రమోట్ చేశేదుకు అధిష్టానం సైతం అడుగులు వేస్తుంది . రాష్ట్రాలలో స్థానిక పరిస్థితులు , నాయకుడిపై ఉన్న విశ్వసనీయత , ప్రజాకర్షణ కొలబద్దగా ఉంటున్నాయి. అందులో భాగంగా తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే జానారెడ్డి అందరికి సమ్మతమైన నేతగా కాంగ్రెస్ లోని ముఖ్యనేతలు భావిస్తున్నారు. అందుకే సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి రంగంలో ఉండటంతో ఆయన నాయకత్వాన్ని నేతలు తెరపైకి తెచ్చారు. సహజంగా కాంగ్రెస్ లో నాయకత్వ సమస్య ఉంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎంపిక చేయటమే కాంగ్రెస్ అధిష్టానానికి కత్తిమీద సాములా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అనే సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే రేసులో డజన్ మందికి పైగా ఉన్నారు. ఎవరికీ వారే ముఖ్యమంత్రి కావాలని ,హైకమాండ్ దృష్టిలో పడాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ కదా ?ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిలను ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకునే సంసకృతి ఉండేది . ఇది కాంగ్రెస్ కు పెద్ద మైనస్ గా మారింది. విమర్శలకు తావిచ్చింది . ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చి తెలుగువాడి ఆత్మగౌరం ఢిల్లీ లో తాకట్టు పెట్టబడిందని, ఆంధ్రుల ఆత్మగౌరం కోసం తెలుగుదేశం ఆవిర్భవించిందని చెప్పిన మాటలు తెలుగు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ అధికారంలోకి అధికారంలోకి రావడానికి ఇది కూడా ఒక కారణమైంది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ వచ్చింది. తిరిగి రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ బలపడి అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించటం
రాష్ట్ర రెండుగా విడిపోవడం జరిగిపోయాయి. అనంతరం ఆంధ్రాలో తెలుగుదేశం , తెలంగాణాలో టీఆర్ యస్ అధికారంలోకి వచ్చాయి.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ,ఆంధ్రతో పాటు తెలంగాణాలో ఓడిపోయింది. ఆంధ్రాలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేక పోవడం తో కాంగ్రెస్ నుంచి వలసలు ప్రారంభమైయ్యాయి. అనేక మంది ఆపార్టీని వీడారు . ఆంధ్రా లో ఆశలు లేకపోయినా తెలంగాణాలో అధికారంలోకి వస్తామని ఆశ ఉంది . తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు సార్లు కేసీఆర్ నాయకత్వంలో ఉన్న టీఆర్ యస్ అధికారంలోకి వచ్చింది.కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా శాసనసభ్యుల్లో పలువురు అధికార టీఆర్ యస్ లో చేరారు.