Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

బీజేపీ ఎంపీ అర్వింద్ ను అడ్డుకున్న గ్రామస్థులు.. కాన్వాయ్‌పై దాడి!

బీజేపీ ఎంపీ అర్వింద్ ను అడ్డుకున్న గ్రామస్థులు.. కాన్వాయ్‌పై దాడి!

  • వ‌ర‌ద ప్రాంతాల ప‌రిశీల‌న‌కు వెళ్లిన ఎంపీ
  • భూ వివాదాన్ని ఎందుకు ప‌రిష్క‌రించలేద‌ని నిల‌దీసిన ఎర్దండి వాసులు
  • గ్రామ‌స్థుల‌పై ఎంపీ అనుచ‌రులు దాడి చేసిన‌ట్లు ప్ర‌చారం
  • తిరుగు ప్ర‌యాణంలో ఎంపీ కాన్వాయ్‌పై దాడికి దిగిన గ్రామ‌స్థులు 

బీజేపీ యువ నేత‌, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌కు శుక్ర‌వారం చేదు అనుభ‌వం ఎదురైంది. వ‌ర‌ద ముంపు ప్రాంతాల ప‌రిశీల‌న‌కు వెళ్లిన ఆయ‌న‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆపై ఆయ‌న కాన్వాయ్‌పై దాడికి దిగారు. జ‌గిత్యాల జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం ఎర్దండిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే… వ‌రద ప్రాంతాల ప‌రిశీల‌న‌కు ఎంపీ వస్తున్నార‌ని తెలుసుకున్న ఎర్దండి వాసులు ఆయ‌న ముందు నిర‌స‌న తెలిపేందుకు య‌త్నించారు. త‌మ గ్రామానికి చెందిన ఓ భూ వివాదాన్ని ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చిన అర‌వింద్ ఆ త‌ర్వాత దానిని ప‌ట్టించుకోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన గ్రామ‌స్థులు ఎంపీ కాన్వాయ్‌కు రోడ్డుకు అడ్డంగా నిలుచున్నారు. అయితే పోలీసులు గ్రామ‌స్థులను ప‌క్క‌కు త‌ప్పించి ఎంపీ కాన్వాయ్‌ని ముందుకు పంపించారు.

ఈ స‌మ‌యంలో అర్వింద్ వెంట వ‌చ్చిన బీజేపీ శ్రేణులు గ్రామ‌స్థులపై దాడికి దిగార‌న్న వార్త‌తో వారంతా ఒక్కసారిగా రోడ్డుపైకి చేరుకున్నారు. వ‌ర‌ద ప్రాంతాల ప‌రిశీల‌న ముగించుకుని తిరిగి వ‌స్తున్న ఎంపీ కాన్వాయ్‌ను గ్రామ‌స్థులు మ‌రోమారు ఆపేశారు. దీంతో వారిపై పోలీసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా… ఎంపీ కాన్వాయ్‌పై గ్రామ‌స్థులు దాడికి దిగారు.

ఈ దాడిలో కాన్వాయ్‌లోని ఓ కారు రెండు అద్దాలు ప‌గిలిపోయాయి. ఎలాగోలా ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు… గ్రామ‌స్థులను ప‌క్క‌కు త‌ప్పించి ఎంపీ కాన్వాయ్‌ను అక్క‌డి నుంచి పంపించివేశారు. ఈ దాడిని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ తీవ్రంగా ఖండించారు.

villagers attack on bjp mp arvind convoy

 ఇది టీఆర్ఎస్ పిరికిపంద చర్య అంటూ బండి సంజయ్ ఫైర్

Attack on MP Arvind This is a cowardly act of TRS says Sanjay Fire
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో వరద ముంపు బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో పెద్ద సంఖ్యలో మోహరించిన నేతలు, కార్యకర్తలు అర్వింద్ కాన్వాయ్ పై దాడికి దిగారు. ఈ సందర్భంగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను తప్పించి.. ఎంపీ అర్వింద్ ను అక్కడి నుంచి పంపించివేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.

నిలదీస్తే జీర్ణించుకోలేకనే..
టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ల నియంతృత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకే బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇది ముమ్మాటికీ పిరికి పందల చర్యేని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు అసహ్యించుకుంటున్నా.. వారిలో మార్పు రాకపోవడం దారుణమని పేర్కొన్నారు. తాము ఇంకా నిలదీస్తూనే ఉంటామని, పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని.. భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ముంపు బాధితుల భూములను లాక్కున్నారు: అర్వింద్
ఎర్దండి గ్రామంలో ముంపునకు గురైన వారిని పరామర్శించేందుకు వెళ్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు తనను అడ్డుకోవడంపై అర్వింద్ మండిపడ్డారు. ఇక్కడి గోదావరి ముంపు బాధితులకు ప్రభుత్వం గతంలో పట్టాలిచ్చిందని.. కానీ ఆ భూములను స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ బంధువులకు ఇప్పించుకున్నారని అర్వింద్ ఆరోపించారు. ఈ తప్పును ఎత్తిచూపుతానన్న భయంతోనే తనపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

Related posts

రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ ఎస్సై దుర్మరణం.. వారం రోజుల క్రితమే వివాహం!

Drukpadam

మంత్రి హరీష్ రావు కు కీలక భాద్యతలు….?

Drukpadam

ఇకపై ఏ పార్టీలో చేరను: యశ్వంత్ సిన్హా!

Drukpadam

Leave a Comment