Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌.. ప్రకటించిన నడ్డా!

ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌.. ప్రకటించిన నడ్డా!
-రాజ‌స్థాన్‌కు చెందిన ధ‌న్‌క‌ర్ వృత్తిరీత్యా న్యాయ‌వాది
-జ‌న‌తాద‌ళ్ త‌ర‌ఫున 1989లోనే ఎంపీగా గెలిచిన వైనం
-కేంద్ర మంత్రిగా ప‌నిచేసిన ధ‌న్‌క‌ర్‌
-2003లో బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి
-ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న వైనం

వెంకయ్యనాయుడికి మొండిచెయ్యి… భారత్ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్ డి ఏ తరఫున పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా కొనసాగుతున్న జగదీప్ ధన్కర్ ను ప్రకటించింది. బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆయన బెంగాల్ గవర్నర్ గా కొనసాగుతున్న విషయం విదితమే. అయితే ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు రేసులో వెంకయ్య నాయుడు తో పాటు మరి కొంత మంది పేర్లు వినిపించినప్పటికీ వారెవరినీ పట్టించుకోకుండా అనూహ్య రీతిలో బెంగాల్ గవర్నర్ జగదీష్ ధన్కర్ పేరును ప్రకటించడం విశేషం. కేంద్రం నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది . ఈ పేరు ఈ మధ్యకాలంలో ఎక్కడా ప్రస్తావనకు రాకపోవటం గమనార్హం. అయితే మరికొంత మంది పేర్లను బిజెపి పరిశీలించినప్పటికీ అనేక కారణాల రీత్యా ధన్కర్ వైపు మొగ్గుచూపినట్లు తెలిసింది. వెంకయ్య నాయుడు తిరిగి ఉప రాష్ట్రపతిగా కొనసాగుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తెలుగు పత్రికలు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుని కొనసాగిస్తారని వార్తా కథనాలు ప్రచురించాయి. అంతకుముందు రాష్ట్రపతి అభ్యర్థి రేసులో వెంకయ్య నాయుడు ఉన్నారని ఆయన అనుభవం ,భాష ,కలుపుగోలు తన ఉపయోగపడతాయని అభిప్రాయాలూ ఉన్నాయి.
బిజెపి పెద్దలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని అందుకే వెంకయ్య నాయుడు తో బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారని వార్తా కథనాలు వెలువడిన విషయం విధితమే. అయితే అనుకోని పరిస్థితుల్లో అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము పేరు ఎన్డీఏ ప్రకటించింది. అప్పటినుంచి వెంకయ్యనాయుడికి ఉప రాష్ట్రపతి పదవి కూడా తిరిగి దక్కకపోవచ్చు ప్రచారం జరిగినప్పటికీ.కొద్ది రోజుల క్రితం నుంచి తిరిగి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి లభిస్తుందని ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ కేంద్రం వెంకయ్యనాయుడుపేరును పరిగణలోకి తీసుకోలేదు.

ఉప‌రాష్ట్రప‌తి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ ఎంపిక‌య్యారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేస్తున్న జ‌గ‌దీప్‌ను బీజేపీ త‌న ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా శ‌నివారం రాత్రి ఢిల్లీలో ప్ర‌క‌ట‌న చేశారు. బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా న‌డ్డా ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్నర్‌గా కొన‌సాగుతున్న ధ‌న్‌క‌ర్ రాజ‌స్థాన్‌కు చెందిన వారు. వృత్తిరీత్యా న్యాయ‌వాది అయిన ధ‌న్‌క‌ర్‌… సుప్రీంకోర్టులో ప‌లు కేసుల‌ను వాదించారు. రాజ‌స్థాన్ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగానూ ఆయ‌న ప‌నిచేశారు. 1989లో జ‌న‌తాద‌ళ్ త‌ర‌ఫున ఎంపీగా గెలిచిన ధ‌న్‌క‌ర్‌.. 1989-91 మ‌ధ్య కాలంలో కేంద్ర మంత్రిగా కూడా ప‌నిచేశారు. 2003లో ఆయ‌న బీజేపీలో చేరారు. శ‌నివారం బీజేపీ పార్ల‌మెంట‌రీ భేటీకి ముందుకు ప్ర‌ధాని మోదీతో ధ‌న్‌క‌ర్ భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న పేరును ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ ఎంపిక చేసి ప్రకటించింది. .

Related posts

నేను ఇకనుంచి పాలేరు బిడ్డను …రాజన్న రాజ్యం తెస్తా :షర్మిల

Drukpadam

నువ్వు దీపావళి బాంబు వదిలావు… రేపు నేను హైడ్రోజన్ బాంబు వదులుతా: ఫడ్నవీస్ కు నవాబ్ మాలిక్ కౌంటర్!

Drukpadam

మోడీ విషసర్పం అన్న ఖర్గే …? భగ్గుమన్న బీజేపీ

Drukpadam

Leave a Comment