Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీఎం కేసీఆర్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా తుమ్మల!

సీఎం కేసీఆర్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా తుమ్మల!
-సమీక్షా సమావేశంలోనూ పాల్గొన్న తుమ్మల
-తుమ్మల సలహాలు విన్న సీఎం కేసీఆర్
-గతంలో వరదల సందర్భంగా తీసుకున్న చర్యలు వివరించిన తుమ్మల 
-ఇప్పటి అవసరాలు వివరించిన తుమ్మల

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలాకాలం తర్వాత సీఎం నేడు భద్రాచలం గోదావరి వరద భాదితులను ప్రరామర్శించడానికి వచ్చిన సందర్భంగా కలవడంపై ఆసక్తి నెలకొన్నది . ఇటీవల కాలంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు . అయితే పాలేరు నియోజకవర్గంలో తిరుగుతూ తాను పోటీచేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. గత నెలలో ఖమ్మం లో జరిగిన రాజ్యసభ ఎంపీ ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు . తమకు రాజ్యసభ సీట్లు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు వద్దిరాజు రవిచంద్ర , బండి పార్థసారథి రెడ్డి లు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు . తిరిగి భద్రాచలం సీఎం పర్యటనలో కనిపించరు. ఇటీవల పాలేరు పర్యటనలు కూడా ఎందుకో తగ్గించారు .

భద్రాచలం లో సీఎం సమావేశంలో మొదటి వరసలో లో డీజీపీ మహేందర్ రెడ్డి పక్కన కూర్చున్న తుమ్మలతో గోదావరి వరదలపై సీఎం కేసీఆర్ మాట్లాడటం కనిపించింది. తరువాత డీజీపీ తోనూ సరదాగా మాట్లాడారు .

సమావేశం ముగిసిన తరువాత కూడా సీఎం వెంట కొద్దీ దూరం వెళ్లారు . తరువాత భద్రాచలంలో తనను కలిసిన మీడియా తో మాట్లాడుతూ గతంలో కరకట్ట నిర్మాణం మీ హయాంలో జరిగిందని ప్రజలు భావిస్తున్నారు కదా ? అని ప్రశ్నించగా ప్రజలు సంతోషం కన్నా జీవితంలో కావాల్సిందే ఏమిటని ? అన్నారు . ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనే కరకట్ట నిర్మాణం చేపట్టామని అన్నారు . అప్పటి సీఎం చంద్రబాబు ను ఒప్పించి దీన్ని నిర్మించడం జరిగిందని అన్నారు . గతంలో ఏ కొద్దిపాటి వరదలు వచ్చిన భద్రాచలంలో గోదావరి నది నీరు చేరి ఇళ్లలోకి నీరు వచ్చేదని అందువల్ల శాశ్విత పరిస్కారం కోసం కరకట్ట నిర్మాణమే మార్గమని అధికారులను పురమావించి నిర్మాణం చేశామన్నారు . తరువాత దాన్ని మరికొంత దూరం పొడిగించాలని బావించామన్నారు .

Related posts

ముస్లింలకు మంత్రి పువ్వాడ అజయ్ రంజాన్ శుభాకాంక్షలు

Drukpadam

రైతుల నిరసనలపై సుప్రీంకోర్టు అసహనం…

Drukpadam

కాలిఫోర్నియా అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం…

Drukpadam

Leave a Comment