Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మహమ్మారి అంతానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాలి: డబ్ల్యూహెచ్ఓ 

 

మహమ్మారి అంతానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాలి: డబ్ల్యూహెచ్ఓ
  • కరోనాను ఎదుర్కోవడంలో గందరగోళం ఉందన్న టెడ్రోస్‌‌ అధనామ్‌
  • పటిష్ఠ చర్యల ద్వారా కొన్ని నెలల్లో నియంత్రించొచ్చు
  • ఏడు వారాలుగా పెరుగుతున్న కేసులు
  • గత వారంలో కేసుల సంఖ్యలో 9శాతం.. మరణాల్లో 5శాతం వృద్ధి
Long way to end pandemic WHO director general

కరోనా మహమ్మారిపై అప్రమత్తంగా ఉండాల్సిందే
-అనేక దేశాలలో విజృభింస్తుంది
-అమెరికా తరువాత భారత్ లోనే అధిక కేసులు
-జాగ్రత్తలు పాటించటంలో ఆలసత్వం పనికిరాదు
-అంతానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాలి: డబ్ల్యూహెచ్ఓ
-కరోనాను ఎదుర్కోవడంలో గందరగోళం ఉందన్న టెడ్రోస్‌‌ అధనామ్‌
-పటిష్ఠ చర్యల ద్వారా కొన్ని నెలల్లో నియంత్రించొచ్చు
-ఏడు వారాలుగా పెరుగుతున్న కేసులు
-గత వారంలో కేసుల సంఖ్యలో 9శాతం.. మరణాల్లో 5శాతం వృద్ధి

కరోనాను ఎదుర్కోవడంలో ఉన్న గందరగోళం, అలసత్వాన్ని బట్టి చూస్తే మహమ్మారి అంతానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ తెలిపారు.పంచంలో అనేక దేశాలలో తిరిగి కరోనా విజృభించటంపై ఆందోళన వ్యక్తం అవుతుంది.ప్రస్తుతం 202 దేశాలకు ఈ మహమ్మారి ఎగబాకింది .ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా ఇప్పటికి కరోనా మహమ్మారిలో అగ్రస్థానంలో ఉంది .రెండవ స్థానంలో ఇండియా ఉండటం ఆందోళనకర విషయం . మొదటి దశలో కంట్రోల్ చేయడంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న ఇండియా తరువాత కాలంలో కొత్త అశ్రద్ధ కనబరచడం రాష్ట్రాలలో ఎన్నికల నేపథ్యంలో తిరిగి విజృభించింది .ప్రస్తుతం దేశంలో రోజుకు లక్ష 65 వేల కేసులు రావడం ఆందోళనకరంగా మారింది. గతంలో లాక్ డౌన్ పాటించిన రాష్ట్రాలు సైతం ఇప్పుడు లాక్ డౌన్ పాటించేందుకు ఇబ్బంది పడుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్నా రాష్ట్రాలలో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎందులో బెంగాల్ లో అత్యధికంగా నమోదు అయ్యాయి. అయితే, పటిష్ఠమైన వైద్య ఆరోగ్య చర్యల ద్వారా కొన్ని నెలల వ్యవధిలో దీన్ని నియంత్రించగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది . ఈ ఏడాది తొలి రెండు నెలల గణాంకాలు చూస్తే… మరణాలు, కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. దీంతో వైరస్‌ను నియంత్రించగలమని.. వేరియంట్లను అడ్డుకోగలమన్న విషయం స్పష్టమైందన్నారు.

గత ఏడు వారాలుగా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని టెడ్రోస్‌ తెలిపారు. ప్రస్తుతం కీలక దశలో ఉన్నామని పేర్కొన్నారు. గత వారంలో కేసుల సంఖ్యలో 9 శాతం.. మరణాల్లో 5 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. కొన్ని దేశాల్లో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. ఇంకా నైట్‌ క్లబ్‌లు, రెస్టారెంట్లు, మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయని తెలిపారు. ఇక కొంతమంది తాము యువకులం కాబట్టి కరోనా సోకినా ఏమీ కాదన్న ధోరణితో వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

 

Related posts

21న మూడు రాజధానుల బిల్లు..

Drukpadam

చిత్తూరు జిల్లాలో కొత్త ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న అమరరాజా గ్రూపు!

Drukpadam

జర్నలిస్ట్ రఘును బేషరతుగా విడుదల చేయాలి…

Drukpadam

Leave a Comment