Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కోడిపుంజు దశదినకర్మకు 500 మందికి భోజనాలు పెట్టారు!

కోడిపుంజు దశదినకర్మకు 500 మందికి భోజనాలు పెట్టారు!
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఆసక్తికర ఘటన
గొర్రె పిల్లను కాపాడిన కోడిపుంజు
దాని త్యాగం, ప్రేమకు చలించిన కుటుంబం

మనుషులను , సొంత కుటుంబసభ్యులను పట్టించుకోని ఈ రోజుల్లో పెపుడు కోడిపుంజు చనిపోతే పట్టించుకోని దానికి దశదిన కర్మలు నిర్వహించడం నిజంగా విశేషమే …ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు మీడియా కథలుకథలుగా చెప్పుకుంటున్నారు . దానికి అంత్యక్రియలు చేయడంతోనే దులిపేసుకోలేదు … దశదిన కర్మలు కూడా నిర్వహించారు . అంతటితో ఆ కుటుంబసభ్యులు ఆగలేదు . కర్మలకు 500 వరకు పిలిచి భోజనాలు కూడా పెట్టారు . వారిని అందరు శహభాష్ అంటున్నారు .

తమ పెంపుడు జంతువులు చనిపోతే వాటికి తమ కుటుంబ సభ్యుల మాదిరే అంత్యక్రియలు చేసే వారు కూడా ఉంటారు. కొందరు సమాధులు కూడా కట్టిస్తుంటారు. ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. తమ పెంపుడు కోడిపుంజుకు దశదినకర్మ నిర్వహించడమే కాకుండా… 500 మందికి భోజనాలు కూడా పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే, ఓ కుటుంబం ఒక కోడిపుంజును పెంచుకుంటోంది. ఒకరోజు వారు పెంచుకుంటున్న ఒక నెల వయసున్న గొర్రె పిల్లను అది కాపాడింది. ప్రాణాలకు తెగించి, ఊరకుక్కల బారి నుంచి కాపాడింది. ఈ క్రమంలో అది తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది.

దాని త్యాగం, ప్రేమ ఆ కుటుంబాన్ని కలచివేసింది. దీంతో, మనిషికి ఎలాగైతే అంత్యక్రియలు చేస్తారో దానికి కూడా అలాగే చేశారు. అంతేకాదు, దాని ఆత్మకు శాంతి చేకూరాలని దశదినకర్మను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది వరకు హాజరయ్యారు. అందరికీ ఆ కుటుంబం భోజనాలు కూడా పెట్టింది.

Related posts

తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు విజయం

Ram Narayana

పులివెందులలో జగన్ …స్పీకర్ బాధ్యతల స్వీకారానికి డుమ్మా…

Ram Narayana

రేవ్ పార్టీ పై పోలిసుల రైడ్ ….పోలీసులపైకి చిక్కిన సినీప్రముఖులు …

Ram Narayana

Leave a Comment