Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మండల కేంద్రం కాబోతున్న ఎంపీ గాయత్రీ రవి సొంత గ్రామం ఇనగుర్తి …?

మండల కేంద్రం కాబోతున్న ఎంపీ గాయత్రీ రవి సొంత గ్రామం ఇనగుర్తి …?
-తెలంగాణ మరో నూతన మండల
-నూతన మండలం గా మహా బుబాబాద్ జిల్లా చారిత్రక ‘ఇనుగుర్తి..
-అన్ని అర్హతలు ఉన్న ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలని కొన్ని ఏళ్ల పాటు గా కొనసాగుతున్న డిమాండ్…
-ప్రజల ఆకాంక్షలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లి విజ్ఞప్తి చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర..
-ఇప్పటికే పలు మార్లు సీఎం కేసిఆర్ కు విజ్ఞప్తి చేసిన.. మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు..

ఇటీవలనే అధికార టీఆర్ యస్ రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన వద్దిరాజు రవిచంద్ర స్వగ్రామం ఇనగుర్తి మండల కేంద్రం కాబోతుందా ? అంటే అవుననే సమాధానమే వస్తుంది…. ఇనగుర్తి ని మండల కేంద్రం చేయాలనీ ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు , ఎమ్మెల్యేలు పలుమార్లు ఇనగుర్తిని మండల కేంద్రం చేయాలనే ప్రజల డీమాండ్ ను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిన వివిధకారణాలవల్ల మండల కేంద్రం కాలేదు .నిన్ననే రాష్ట్రంలో పలు జిల్లాల్లోని 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాజ్యసభ సభ్యులు వడ్ఢరిరాజు రవిచంద్ర ఇనగుర్తి మండల కేంద్రం కావాల్సిన ఆవశ్యకత గురించి సీఎం దృష్టికి తెచ్చారు .ఇనుగుర్తిని మండలం గా గుర్తించవలసిన నేపథ్యాన్ని, చారిత్రక సందర్భాన్ని, అన్ని అర్హతల వివరాలతో కూడిన వినతి పత్రాన్ని ఆదివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ కు అందజేసి విజ్ఞప్తి చేసిన ఎంపీ వద్దిరాజు… పైగా అది తన సొంత గ్రామమని మండల కేంద్రానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని సీఎం కు వివరించారు . సీఎం కేసీఆర్ రవి చెప్పిన మాటలు విని మండల కేంద్రం చేయాలంటే కావాల్సిన ప్రామాణికాలు అందజేయటంతో సానుకూలంగా స్పందించి వాటిని పరిశీలన నిమిత్తం అధికారులకు అందించారు .

వద్దిరాజు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్…

ఇనగుర్తికి నిర్దేశిత అర్హతలను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుసుంది .
సోమవారం ఉమ్మడి జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం …
మండలం గా ప్రకటించే అర్హతలు ఇనుగుర్తికి వున్నాయని రెవెన్యూ శాఖ ఆమోదిస్తే..మరో రెండు మూడు రోజుల్లో ఇనుగుర్తిని, నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నదని సమాచారం..

Related posts

లంచాలు తీసుకోక తప్పదన్న తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

Ram Narayana

సీఎం జగన్ పై దాడి ఘటన పట్ల బెజవాడ సీపీ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే…!

Ram Narayana

భారత్ తో బంధం ముఖ్యమే.. కానీ మా సార్వభౌమత్వం మాకు మరింత ముఖ్యం: కెనడా రక్షణ శాఖ మంత్రి

Ram Narayana

Leave a Comment