ఖమ్మం ,వరంగల్ కార్పొరేషన్ లకు ఈనెల 30 ఎన్నికలు
తెలంగాణలో మినీ మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ విడుదల
రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు
రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ
22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం
ఖమ్మం ,వరంగల్ కార్పొరేషన్ లకు ఎన్నికలకు నోటిఫికేషన్ రేపు ఉదయం విడదల కానున్నది , ఈనెల 30 ఎన్నికలు , 3 న కౌంటింగ్ ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం షడ్యూల్ విడుదల చేసింది.ఎన్నికలు జరిగే కార్పొరేషన్ లు , మున్సిపాలిటీలలో రిజర్వేషన్ లు ప్రకటించారు. మినీ ఎన్నికల పోరుగా భావిస్తున్న ఈ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తుంది. అందులో భాగంగానే సాగర్ ఎన్నికల కౌంటింగ్ కు రెండు రోజులకు ముందు ఎన్నికలను నిర్వహించనున్నారు.టీఆర్ యస్ ఇప్పటికే అన్ని పార్టీలకన్న మినీ పోరుకు సిద్ధమైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఓటర్ల ఓటువేసేందుకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని వేదంగా ఏర్పాట్లు చేయనున్నారు.
. మినీ పురపోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది . రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు… జడ్చర్ల, అచ్చంపేట, సిద్ధిపేట, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రేపటి నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 19న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు 22వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 30న పోలింగ్ జరగనుంది. మే 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.