రాష్ట్రపతి నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ముగ్గురు తెలంగాణ టీచర్లు…
- ఉపాధ్యాయ దినోత్సవాన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం
- రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
- తెలంగాణ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు అవార్డులు
- అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన డీకే అరుణ
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం బోధనలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉత్తమ బోధనలు సాగించిన ఉపాధ్యాయులను కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. వీరికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు.
ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో టీఎన్ శ్రీధర్, కందాల రామయ్య, శ్రీమతి సునీత రావు ఉన్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో వీరు రాష్ట్రపతి నుంచి అవార్డులు స్వీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.