Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మంత్రులకు ఏపీ సీఎం జగన్ వార్నింగ్ ….

తీరు మార్చుకోకపోతే కేబినెట్‌నే మారుస్తా!.. మంత్రుల‌కు క్లాస్ పీకిన జ‌గ‌న్‌!
కేబినెట్ భేటీ త‌ర్వాత గంట పాటు మంత్రుల‌తో జ‌గ‌న్ భేటీ
విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు దీటుగా జ‌వాబివ్వాల‌ని ఆదేశం
పధ్ధతి మార్చుకోక‌పోతే మంత్రివ‌ర్గాన్ని మారుస్తాన‌ని హెచ్చ‌రిక‌

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం నాటి కేబినెట్ భేటీ ముగిశాక… త‌న మంత్రివ‌ర్గ స‌హచ‌రుల‌పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కేబినెట్ భేటీ ముగిశాక దాదాపుగా గంట పాటు మంత్రుల‌కు క్లాస్ పీకిన్ జ‌గ‌న్‌… విప‌క్షాల విమ‌ర్శ‌ల‌పై కౌంట‌ర్లు ఇవ్వ‌లేకపోతున్నార‌ని ఆయ‌న మంత్రుల‌ను నిల‌దీశారు. మంత్రులు చురుగ్గా వ్యహరించకపోతే బ్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది , ప్రతిపక్షాలు గుడ్డ కాల్చి మీద వేస్తుంటే మంత్రులు మౌనంగా ఉంటె ఎలా అని అసహనం వ్యక్తం చేశారు .

ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చినా స్పందించ‌కుంటే… అస‌లు మంత్రులు ఉన్న‌ట్టా? లేన‌ట్టా? అని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ త‌ర‌హా అల‌స‌త్వం ఎంత‌మాత్రం త‌గ‌ద‌ని కూడా ఆయ‌న హెచ్చ‌రించారు. మీరు మారతారా ? మార్చమంటారా ? అని ఒకింత కటువుగానే అన్నట్లు సమాచారం .

ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ… నేరుగా త‌న కుఇటీవ‌లే వెలుగు చూసిన ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న భార్య భార‌తి, విజయసాయి రెడ్డిల‌కు ప్ర‌మేయం ఉందంటూ విప‌క్షం టీడీపీ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఏపీ కేబినెట్‌లోని మంత్రుల నుంచి ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా స్పందించిన సందర్భంలేదు లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారని తెలుస్తుంది. .

తమ కుటుంబం మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పైనా స్పందించ‌రా? అని జ‌గ‌న్ నిల‌దీశారు. ఇదే త‌ర‌హా ప‌రిస్థితి కొన‌సాగితే… మంత్రివ‌ర్గాన్ని మార్చాల్సి వ‌స్తుంద‌ని కూడా జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. పధ్ధతి మార్చుకోవాల‌ని… పార్టీ, ప్ర‌భుత్వంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఖండించాల‌ని, వాటికి కౌంట‌ర్లు ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు. మంత్రులకు గతంలో అనేక సార్లు క్లాస్ తీసుకున్న ఇంట కటువుగా తీసుకున్న దాఖలాలు లేవని అంటున్నారు . ఒక పక్క ప్రభుత్వం పై ప్రతిపక్షాల ఆరోపణలు మరో పక్క కోర్టుల ఎప్పుడు ఎలా స్పందిస్తాయోననే అభిప్రాయాలూ కూడా కలగటంపై ఏపీ మంత్రివర్గంలో చర్చ జరిగినట్లు చెప్పుకుంటున్నారు .

Related posts

ఢిల్లీకి వచ్చిన మంత్రులను అవమానిస్తున్నారు …మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

Drukpadam

టీఆర్ యస్ ,బీజేపీ డ్రామాలతో రాష్ట్రానికి దక్కకుండా పోయిన ఆయుష్ వైద్య కేంద్రం…ఆరెస్పీ!

Drukpadam

కేటీఆర్ మాట్లాడింది నిజమా? లేక ఈటల రాజేందర్ మాట్లాడింది నిజమా?: రాజాసింగ్

Drukpadam

Leave a Comment