Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం కార్పొరేషన్ లో కాంగ్రెస్ ,సిపిఎం,తెలుగుదేశం పొత్తు 

ఖమ్మం కార్పొరేషన్ లో కాంగ్రెస్ ,సిపిఎం,తెలుగుదేశం పొత్తు…?
-కాంగ్రెస్ 25 నుంచి 30 డివిజన్లలో సిపిఎం 25 , తెలుగుదేశం 5 నుంచి 7 డివైజ్లలో పోటీకి అవకాశం
-గులాబీ దళంతో కలిసి నడవనున్న సిపిఐ
-సీపీకి 4 డివిజన్లు …?
-ఒంటరిగానే పోటీకి సై అంటున్న బీజేపీ
-అభ్యర్థుల ఎంపికలో తలమునకలు
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీల మధ్య పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికలకు కొద్దీ రోజులే ఉండటంతో అన్ని పార్టీల్లో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. అధికార అండతో టిఆర్ యస్ మిగతా పార్టీలకన్నా ఒకడుగు ముందంజలో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ ప్రణాళిక బద్దంగా అభ్యర్థుల ఎంపికతో సహా ప్రచారంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్ ,సిపిఎం ,తెలుగుదేశం కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వీరి మధ్య సీట్ల పంపకాలు తేలాల్సివుంది. సిపిఎం కు ఇప్పటికి కొంత క్యాడర్ బలం ఉండటంతో ఎక్కువసీట్లు కావాలని కోరుతుంది. కాంగ్రెస్ సిపిఎం , తెలుగుదేశంతో కలిసి పోటీచేయాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీజేపీ ఒంటరిగా పోటీచేసేందుకు సిద్ధమైంది. జనసేన బీజేపీకి మద్దతు ప్రకటించే ఆవకాశం ఉంది.అందువల్ల పోటీ ఆశక్తి కరంగా ఉంటుందని తమకుటమి అనూహ్యఫలితాలు సాదిస్తుందని కాంగ్రెస్ , సిపిఎం ,తెలుగుదేశం కూటమి నేతలు అంటున్నారు. డివిజన్ల పునర్విభజన తరువాత కొంత మంది ఆశావావులకు నిరాశ ఎదురైంది. కొందరు అధికార పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. సీట్లు ఆశించే వారి సంఖ్య అధికంగా ఉండటం తో వారిని ఏవిధంగా నచ్చచెప్పాలనే ఆలోచనతో అధికార పార్టీ ఉంది. టికెట్ రాని కొందరు నేతలు పార్టీ పై గుర్రుగా ఉన్నారు. వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గరనుంచి అన్ని తానై మంత్రి అజయ్ వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ గెలిపించాల్సిన భాద్యత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పై పెట్టారు .దీంతో అజయ్ రెట్టించిన ఉత్సవంతో తిరుగుతున్నారు. మొత్తం అన్ని డివిజన్లు గెలవాలనేది మంత్రి లక్ష్యం గా ఉంది.ఇందుకోసం అభ్యర్థుల ఎంపిక పై మంత్రి ఒక అంచనాతో ఉన్నారు. సిపిఐ తో పొత్తు పెట్టుకొని వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. సిపిఐ గతంలో 2 డివిజన్లు గెలవగా ఆ పార్టీ 6 డివిజన్లు అడుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే మంత్రి మాత్రం మరో డివిజన్ తో సరిపెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద 4 డివిజన్లకు ఫైనల్ అయినట్లు సమాచారం . అంటే టీఆర్ యస్ పార్టీ 56 డివిజనాలలో పోటీచేయనున్నట్లు సమాచారం . బీజేపీ మొత్తం 60 డివైజ్లలో పోటీ చేయనున్నది. ఖమ్మం నగరంలో ఈ సారి తమ ఉనికిని చాటాలని గట్టి పట్టుదలతో ఉంది.. ఇక కాంగ్రెస్ ,25 నుంచి 30 డివిజన్లలో పోటీచేసేందుకు సిద్ధపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం . సిపిఎం కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా సిపిఎం 25 , తెలుగుదేశం 5 నుంచి 8 డివిజన్లలో పోటీచేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. టీఆర్ యస్ నుంచి పాతకాపులకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గత కార్పొరేషన్ లో కార్పొరేటర్లుగా ఉన్నవారిలో ఒకరిద్దరు మినహా అందరు లేదా
వారి కుటుంబ సభ్యులు పోటీచేసే అవకాశం ఉంది.

Related posts

రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించింది చంద్రబాబే.. ఎందుకంటే?: పోచారం

Drukpadam

హుజూరాబాద్ నుంచి ఈట‌ల భార్య పోటీ?.. ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన జ‌మున‌!

Drukpadam

కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ వస్తాయి…..రేవంత్ రెడ్డి

Drukpadam

Leave a Comment