Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కూనంనేని ఖమ్మం జిల్లా రాక…దుందాంగా స్వాగతం పలికిన సిపిఐ శ్రేణులు..

 కూనంనేని ఖమ్మం జిల్లా రాక…దుందాంగా స్వాగతం పలికిన సిపిఐ శ్రేణులు..
-సీపీఐ తెలంగాణ కార్య‌ద‌ర్శిగా ఎన్నికైన తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూనంనేని
-కూనంనేని అభినందన సభలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్
-కమ్యూనిస్టులకు మంచి భవిషత్ ఉందన్న మంత్రి
-ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంత్రిని స్టేజ్ పైనే కోరిన కూనంనేని
-సానుకూలంగా స్పందించిన మంత్రి అజయ్
-బీజేపీ క‌రోనా కంటే ప్ర‌మాదకరం: కూనంనేని
-దేశంలో పొత్తులు పెట్టుకోని పార్టీలు లేవ‌ని వ్యాఖ్య
-సీపీఐ పొత్తుల‌పై ఏ ఒక్క‌రికీ అనుమానాలు అవ‌స‌రం లేద‌న్న నేత‌

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కూనంనేని సాంబశివరావు కొద్దిరోజుల క్రితం హైద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర సభలో కార్యదర్శిగా ఎన్నికైన అంతంతరం తొలిసారిగా గురువారం ఖమ్మం వచ్చారు . ఈ సందర్భంగా ఆయనకు ఖమ్మం శివార్లలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద సిపిఐ శ్రేణులు ఘానా స్వాగతం పలికాయి. అక్కడ జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తనను ఈస్థాయికి తెచ్చిన జిల్లా ప్రజలకు , ప్రత్యేకించి కమ్యూనిస్ట్ నాయకులకు రుణపడి ఉంటానని అన్నారు . కార్యకర్తలకు ఏ ఆపాద వచ్చిన వెన్నంటి ఉంది కంటికి రెప్పలా కాపాడుకుంటామని సభికుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు .

ఖమ్మం రూరల్ పోలీస్ అధికారిపై ఆగ్రహం

ఖమ్మం రూరల్ సీఐ హత్య రాజకీయాలను ప్రోత్సవిస్తున్నారని ఇలాంటి అధికారులను తమ పార్టీ ఎందరినో చూసిందని తమ కీలక నేత పిటిషన్ ఇచ్చేందుకు స్టేషన్ కు వెళ్ళితే నీకు క్రిష్ణయ్య కు పట్టిన గతే పడుతుందని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రజలకోసం పనిచేసే నాయకులను రక్షించాల్సిన పోలీసులు హత్య రాజకీయాలను ప్రోత్సహించడంపై మండిపడ్డారు . నిన్ను వదిలి పెట్టమని ఎన్నోకేసులను తాము ఎదుర్కొన్నామని అవసరమైతే ఎక్కడకు పోయేందుకైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రాజకీయాలు చేయదల్చుకుంటే చొక్కా విప్పి రావాలని సిపిఐ రాష్ట్ర నాయకులూ భాగం హేమంతరావు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూనే తీరు మారకుంటే తామే చొక్కా విప్పుతామని
వార్నింగ్ ఇచ్చారు .

అనంతరం ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ లోగల క్రిష్ణా ఫంక్షన్ హాల్ లో జరిగిన ఆత్మీయ సన్మాన సభలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా సాంబశివరావు ను పార్టీ నాయకులూ కార్యకర్తలు అభిమానులు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు .

జిల్లా మంత్రి పువ్వాడ అభినందన

సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కూనంనేని సాంబశివరావు ఎన్నికవడం పట్ల జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సన్మాన సభలో కలిసి అభినందనలు తెలిపారు . కమ్యూనిస్టులకు మంచి భవిషత్ ఉందని ,టీఆర్ యస్ ,ఉభయ కమ్యూనిస్టులు కలిసి ప్రయాణం చేయడం శుభపరిణామం అని అన్నారు .

బీజేపీ కరోనా కంటే ప్రమాదకారి …

సీపీఐ తెలంగాణ శాఖ కార్య‌ద‌ర్శిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కూనంనేని సాంబ‌శివ‌రావు రాజ‌కీయ పార్టీల పొత్తుల గురించి గురువారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో పొత్తులు పెట్టుకోని పార్టీ అంటూ ఏదీ లేద‌ని ఆయ‌న అన్నారు. సీపీఐ పార్టీ పొత్తుల గురించి ఏ ఒక్క‌రికీ అనుమానాలు అవ‌స‌రం లేద‌ని కూడా ఆయ‌న అన్నారు.

ఈ సందర్భంగా బీజేపీపై కూనంనేని ఓ ఘాటు వ్యాఖ్య చేశారు. బీజేపీ క‌రోనా maకంటే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. ఈ కార‌ణంగానే మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో తాము టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు. క‌మ్యూనిస్టులు లేకుండా ఏ పార్టీ ముందుకు వెళ్ల‌లేద‌న్న ఆయ‌న… తెలంగాణ చ‌రిత్ర‌లో సీఎం కేసీఆర్ చెప్పే ప్ర‌తి పేరు క‌మ్యూనిస్టుదేనన్నారు.

Related posts

జీ20 సదస్సును నిర్వహించడం పెద్ద గొప్పేం కాదు: కేశవరావు

Drukpadam

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట :సజ్జల రామకృష్ణారెడ్డి…

Drukpadam

పాలేరునుంచి తిరిగి కందాల పోటీ ..మంత్రి ప్రశాంత రెడ్డి….!

Drukpadam

Leave a Comment