Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆకలిని నియంత్రించడానికి ఉపయోగపడే ఐదు ఆహార పదార్థాలు ఇవీ!

ఆకలిని నియంత్రించడానికి ఉపయోగపడే ఐదు ఆహార పదార్థాలు ఇవీ!

  • విపరీతంగా ఆకలి వేసే వారికి పలు రకాల ఆహారంతో నియంత్రణ
  • బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్నవారికి ప్రయోజనం అంటున్న నిపుణులు
  • కొబ్బరి, బట్టర్ మిల్క్ వంటి ఉత్పత్తులు తీసుకోవాలని సూచనలు

చాలా మంది బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం తక్కువ తినడమో, ఆహారం తీసుకున్న సమయాల్లో ఎక్కువ గ్యాప్ ఇవ్వడమో చేస్తుంటారు. ఇలాంటి సమయంలో కడుపు ఖాళీగా ఉండి ఆకలి వేస్తుంది. కొందరిలో అయితే పొట్టపైబాగంలో ఎడమవైపు నొప్పిగా కూడా అనిపిస్తుంటుంది. బాగా ఎక్కువ ఆకలిగా అనిపించినప్పుడు జీర్ణాశయం నుంచి వెలువడే కాంట్రాక్షన్స్, జీర్ణ హార్మోన్ల విడుదల వల్లే ఆ నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నొప్పిని హంగర్ ప్యాంగ్స్ గా పిలుస్తారని వివరిస్తున్నారు.

పోషకాల కోసం కూడా..
కడుపులో ఈ రకమైన నొప్పి కేవలం ఆహారం కోసం మాత్రమేకాదని.. శరీరానికి అవసరమైన కొన్ని రకాల పోషకాలు అందనప్పుడూ అలా నొప్పి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి ఆకలి నొప్పిని తగ్గించేందుకు ఐదు రకాల ఆహార పదార్థాలు తోడ్పడుతాయని చెబుతున్నారు.

1. బాదం 
ఆకలి నియంత్రణ, హంగర్ ప్యాంగ్స్ ను తగ్గించడంలో బాదం బాగా తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పులో మంచి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ వంటివన్నీ ఉంటాయని.. దీనితో శరీరానికి అవసరమైన పోషకాలు కడుపు నిండుగా ఉన్న భావన ఉంటుందని వివరిస్తున్నారు.

2. కొబ్బరి
హంగర్ ప్యాంగ్స్ ను తగ్గించడంతోపాటు శరీరంలో కొవ్వును త్వరగా కరిగించేందుకు కొబ్బరి బాగా తోడ్పడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక కొబ్బరిలోని పోషకాలతోపాటు చాలా ఎక్కువగా ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుందని వివరిస్తున్నారు. ఆహారం తీసుకోవడం ఆలస్యమై, శరీరానికి బయటి నుంచి శక్తి అందని సమయంలో.. అప్పటికప్పుడు పుట్టే ఆకలిని నియంత్రించడానికి వీలు కలుగుతుందని పేర్కొంటున్నారు.

3. మొలకెత్తిన శనగ గింజలు
మొలకెత్తిన శనగ గింజల్లో ప్రోటీన్లు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం మొలకెత్తిన శనగలు అద్భుతమైన ఆహారంగా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని.. ఆకలి హార్మోన్లను తగ్గిస్తుందని వివరిస్తున్నారు. దీనితో ఆకలి తగ్గి ఆహారం కూడా తక్కువగా తీసుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు.

4. బట్టర్ మిల్క్ (మజ్జిగ)
ఆకలి నియంత్రణలో, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో బట్టర్ మిల్క్ (మజ్జిగ) అద్భుతంగా తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆకలి నియంత్రణ, ఆహారం తీసుకోవడాన్ని తగ్గించడంలో మజ్జిగలోని కాల్షియం, ప్రోటీన్లు తోడ్పడతాయని వివరిస్తున్నారు.

5. అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్), కూరగాయల జ్యూస్
సాధారణంగా కూరగాయల నుంచి ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. అయితే కూరగాయలను సలాడ్లుగా తినడం ఇష్టం లేని వారు.. వాటిని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల యాంటీ యాక్సిడెంట్లు, ఫైబర్ లభిస్తాయని.. ఇవి ఆకలిని నియంత్రిస్తాయని చెబుతున్నారు. ఇక ఈ జ్యూస్ లకు వేయించిన ఫ్లాక్స్ సీడ్స్ ను కూడా కలిపితే మరింత ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.

Related posts

పాకిస్థాన్ లో హత్యకు గురైన కాందహార్ విమాన హైజాకర్!

Drukpadam

మీడియా స్వేచ్ఛను అణిచే ప్రయత్నంలా ఉంది …ఏబీఎన్, టీవీ5లపై కేసులో సుప్రీం వ్యాఖ్య…

Drukpadam

సీఎం కేసీఆర్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా తుమ్మల!

Drukpadam

Leave a Comment