Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ప్రపంచంలోనే సంచలనం … జార్జ్‌ఫ్లాయిడ్ ది ముమ్మాటికీ హత్యే తేల్చిన కోర్ట్

ప్రపంచంలోనే సంచలనం … జార్జ్‌ఫ్లాయిడ్ ది ముమ్మాటికీ హత్యే దోషి డెరెక్ తేల్చిన కోర్ట్
– అప్పటి పోలీస్ అధికారి డెరెక్ దోషి , మరో ముగ్గురు అదిఆరులపై కూడా అభియోగాలు
-కీలక మలుపు తిరిగిన కేసు … శిక్ష ఖరారు చేయనున్న కోర్ట్
-గతేడాది మే 25న పోలీసు అధికారి కర్కశత్వానికి ఫ్లాయిడ్ బలి
-నరహత్యగా అభివర్ణించిన కోర్టు
-త్వరలో డెరెక్‌కు శిక్ష ఖరారు
-అమెరికాలో న్యాయం జరిగిన రోజుగా అభివర్ణించిన కమలా హారిస్
-బాధిత కుటుంబాన్ని వైట్‌హౌస్‌కు పిలించి మాట్లాడిన బైడెన్, హారిస్
అమెరికాలో సంచలనం సృష్టించి అల్లర్లకు కారణమైన ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ప్రపంచమంతా అత్యంత ఆశక్తిగా ఎదురుచూసిన ఈ కేసులో అప్పటి పోలీస్ అధికారి డెరెక్ ముమ్మాటికీ దోషేనని కోర్ట్ తేల్చిచెప్పింది. దీంతో ప్రపంచవ్యాపితంగా హర్హతిరేకలు వ్యక్తం అయ్యాయి. అమెరికాలో కోర్ట్ తీర్పుపై సంబరాలు జరుపుకున్నారు. గతేడాది మే 25న పోలీసు అధికారి డెరెక్ చేతిలో ఫ్లాయిడ్ మరణించాడు. ఫ్లాయిడ్ మెడను మోకాలితో తొక్కిపెట్టడంతో ఊపిరి ఆడక ఆయన ప్రాణాలు కోల్పోయాడు. తనకు ఊపిరి ఆడడం లేదని చెప్పినా డెరెక్ కాలు తీయకపోవడానికి సంబంధించిన వీడియో అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు మాజీ అధికారి డెరెక్ చౌవిన్‌ను కోర్టు తాజాగా దోషిగా ప్రకటించింది. ఫ్లాయిడ్ హత్యను సెకండ్, థర్డీ డిగ్రీ హత్య, నరహత్యగా పేర్కొన్న న్యాయస్థానం శిక్షను త్వరలో ఖరారు చేయనుంది. కోర్టు తీర్పు తర్వాత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తీర్పు సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున కోర్టు వద్ద గుమిగూడడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు.

ఫ్లాయిడ్ హత్య సమయంలో దోషి డెరెక్‌తోపాటు ఉన్న మిగతా ముగ్గురు పోలీసులపైనా అభియోగాలు నమోదు కాగా, ఆగస్టు నుంచి వారిపై విచారణ జరగనుంది. కోర్టు తీర్పు అనంతరం ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ అమెరికాలో న్యాయం జరిగిన రోజుగా అభివర్ణించారు. బాధిత జార్జ్ కుటుంబ సభ్యులను అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వైట్ హౌస్‌కు పిలిపించి మాట్లాడారు.

Related posts

నిజామాబాద్ జిల్లాలో ఘోరం… ఇంటి కోసం ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య

Ram Narayana

లఖిమ్ పూర్ ఖేరి ఘటనలో చనిపోయిన జర్నలిస్ట్ ఐ జె యూ సభ్యుడు!

Drukpadam

కాన్పూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం…

Drukpadam

Leave a Comment