Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి కేసీఆర్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు …?

ముఖ్యమంత్రి కేసీఆర్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు …?
ప్రగతి భవన్ కు పాలపిట్ట.. జంతు ప్రేమికుల ఆగ్రహం
దసరా రోజున పాలపిట్టను దర్శించుకుంటే శుభమని తెలంగాణలో నమ్మకం
పాలపిట్టను పంజరంలో బంధించి ప్రగతి భవన్ కు తీసుకొచ్చిన అధికారులు
పాలపిట్టను బంధించడం చట్ట ప్రకారం నేరం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివాదంలో చిక్కుకున్నారు.పాలపిట్టను తన ఇంటికి తెప్పించుకోవడమే కాకుండా దానిని బందించి తేవడం మహానేరమంటున్నారు నిపుణులు.పైగా అది రాష్ట్ర పక్షిగా కూడా కేసీఆర్ ప్రకటించిన సంగతి గమనార్హం.

దసరా పర్వదినాన పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందనే నమ్మకం తెలంగాణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పండుగ రోజున చూసేందుకు ప్రగతి భవన్ కు పాలపిట్టను ముఖ్యమంత్రి తెప్పించుకున్నారు. సీఎం కోసం అధికారులు పాలపిట్టను పంజరంలో బంధించి తీసుకొచ్చారు.

ఇప్పుడు దీనిపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం పాలపిట్టను బంధించడం నేరం. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు అవుతారు. అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పాలపిట్టను తన ఇంటికి తెప్పించుకోవడం నేరమని అంటున్నారు . తెచ్చినవారు కూడా నేరస్తులేనని వైల్డ్ లైఫ్ యాక్ట్ చెపుతుందని అంటున్నారు. దసరా రోజున ప్రతి చోట పాలపిట్టను పంజరంలో బందించి చూడటం ఆనవాయితీగా మారింది.అందువల్ల సీఎం కూడా దాన్నిచేసేందుకు తెప్పించుకొని ఉంటారని కొందరు అంటున్నారు .

Related posts

సీఎం కేసీఆర్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా తుమ్మల!

Drukpadam

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ చెంప చెల్లు మనిపినిపించిన దుండగుడు !

Drukpadam

రఘువీరా రెడ్డి పై చిరంజీవి ప్రశంశలజల్లు…

Drukpadam

Leave a Comment