26న భారత్ బంద్.. పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
మావోయిస్టు ఉద్యమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధకాండ
ఉద్యమాన్ని నిర్మూలించే ప్రయత్నం
లేఖలో ఆరోపించిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి కైలాసం
ఈ నెల 26న దేశవ్యాప్త బంద్‌కు సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి కైలాసం పేరుతో ఓ లేఖ విడుదలైంది. చత్తీస్‌గఢ్‌లో ప్రహార్-3 పేరుతో ఆదివాసీలు, మావోయిస్టు ఉద్యమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేత ధోరణి అవలంబిస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఈ నెల 26న దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రులు జగన్, నవీన్ పట్నాయక్ మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో నిర్బంధకాండ కొనసాగుతోందని కైలాసం ఆ లేఖలో ఆరోపించారు. గత కొంత కాలంగా మావోయిస్టులకు పోలీసులకు మధ్య దండకారణ్యంలో జరుగుతున్న యుద్ధంలో పైచేయి సాధించేందుకు ఇరువురు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పోలీసులపై జరిపిన కాల్పుల్లో 22 మంది పోలీసులు చనిపోయారు. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవాల్ గా తీసుకున్నాయి.అంబుజ్ మడ్ అడవుల్లో సమాంతర పాలనా సాగిస్తున్న మావోలు టార్గెట్ గా పోలీసులు ఇటీవల డ్రోన్ కెమెరాలతో దాడులు చేయడంపై మావో లు ఆగ్రంగా ఉన్నారు. రెండు డ్రోన్లను పేల్చి వేశామని చెబుతున్నారు. డ్రోన్ కెమెరాలకు తమకు సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే డ్రోన్లను తాము చూపిస్తామని విలేకర్లు లేదా మధ్యవర్తులు వస్తే తమకు అభ్యంతరం లేదని అంటున్నారు. హోమ్ మంత్రి ఏంటి షా ఛత్తీస్ ఘడ్ పర్యటించి మావోలకు హెచ్చరికలు చేశారు. మావోల చెరలో ఉన్న పోలీస్ ను వదిలి పెట్టేందుకు తొలుత షరతు విధించిన మావోలు తరువాత విలేకరుల సమక్షంలో వదిలి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం 22 మంది పోలిసుల మరణంపై సీరియస్ గా ఉంది. మావోల కదలికలపై మరింత ద్రుష్టి సారించింది. మావోలకు , పోలీసులకు మధ్య జరుగుతున్న వార్ లో సామాన్యులు సైతం బలైపోతున్న సంఘటనలు ఉన్నాయి. ఇటు పోలీసులు ,అటు మావోల తుపాకీ మోతలు మందు పాతర్లతో ఏజన్సీ ప్రాంతం దద్దరిల్లు తుంది . ఈ నెల 26 మావోలు తలపెట్టిన బందు ఎలాంటి విపత్కర పరిస్థితులను సృష్టిస్తుందో నేనే ఆందోళన ఏజెన్సీ లో నెలకొని ఉంది .