Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముగిసిన సూర్య గ్రహణం… ఏపీలో మళ్లీ తెరుచుకుంటున్న ఆలయాలు!

ముగిసిన సూర్య గ్రహణం… ఏపీలో మళ్లీ తెరుచుకుంటున్న ఆలయాలు!

  • నేడు పాక్షిక సూర్యగ్రహణం
  • ఈ సాయంత్రం ముగిసిన గ్రహణ ఘడియలు
  • ప్రముఖ ఆలయాల్లో సంప్రోక్షణ
  • ఆలయ శుద్ధి అనంతరం దర్శనాలకు అనుమతి

పాక్షిక సూర్య గ్రహణం కారణంగా ఏపీలోని ప్రముఖ ఆలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం గ్రహణ ఘడియలు ముగిసిన నేపథ్యంలో, ఆలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో సంప్రోక్షణ, ప్రదోష కాల పూజల అనంతరం శ్రీవారి ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఈ రాత్రి 8.30 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను అనుమతించనున్నారు.

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయ ద్వారాలను కూడా తెరిచారు. వేదపండితులు ఆలయ శుద్ధి నిర్వహించారు. రాత్రి 8 గంటల నుంచి భక్తులను అనుమతిస్తున్నారు.

ఇక, సూర్య గ్రహణం అనంతరం శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయ ద్వారాలను తిరిగి తెరిచారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజల అనంతరం రాత్రి 8 గంటల నుంచి భక్తుల దర్శనాలకు అనుమతించారు.

Related posts

చక్కెర.. ఉప్పు.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదకరం?

Drukpadam

యూరప్ లో గాలికి కొట్టుకుపోతున్న జనాలు…

Drukpadam

నిజాన్ని నిగ్గు తేల్చేందుకు కెనడాకు భారత్ సహకరించాలి: అమెరికా

Ram Narayana

Leave a Comment