Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ప్రభావం తగ్గిందా ?

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ప్రభావం తగ్గిందా ?
-మతం మందు తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తుందా ?
-తెలంగాణాలో వారు అనుకున్న విధంగా ముందుకు పోలేక పోతున్నారా ?
-నాయకత్వ సమస్య ఉందా? సంజయ్ కు సహకారం అందటంలేదా ?
-ఆంధ్రప్రదేశ్ లో కన్ఫ్యూజన్ లో ఉన్నారా ?
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయపార్టీ ….. తెలుగు రాష్ట్రాలలో కొంత కాలం క్రితం మంచి ఊపుమీద ఉంది. …. ఇక బీజేపీకి తిరుగులేదని దేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రత్యక్షంగా లేక పర్వక్షంగా తన పార్టీ లేక ఫ్రండ్లీ పార్టీలు అధికారంలో ఉండేవిధంగా పధక రచన చేసింది. … ఆవిధంగా సెక్సెస్ అవుతూ వస్తుంది. బీజేపీ లో చేరకపోతే తమకు ఇబ్బందులు తప్పవని తమ వ్యాపారాలకు రక్షణ ఉండదని భావించి అనేక మంది బీజేపీ లో చేరారు. చేరిని వారికీ కూడా పెద్ద ప్రాధాన్యత లేకపోవడంతో మదన పడుతున్నట్లు తెలుస్తుంది. వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న కీలకనేతలు సైతం వెనకడుగు వేస్తున్నారు . బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఒక నేత మాట్లాడుతూ బీజేపీ లో చేరితే వచ్చే లాభం ఏమిటి? తేలుతూ రాష్ట్రాలలో దాని ప్రభావం పెద్దగా ఉంటుందని తాను భావించటం లేదని అన్నారు. తెలంగాణాలో బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తరువాత దూకుడు పెరిగిందని ఇక బీజేపీదే 2023 ఎన్నికల్లో అధికారం అని ప్రచారానికి ప్రాధాన్యత వచ్చింది. అందుకనుగుణంగానే దుబ్బాక అసెంబ్లీ కి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రఘునందన్ రావు ఘన విజయం సాధించారు. అధికారంలో ఉన్న పార్టీని కాదని ఓటర్లు బీజేపీ కి ఓట్లు వేయడం దాని రారువాత జరిగిన హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో కూడా బీజేపీ ,మంచి ఫలితాలు సాధించటంతో బీజేపీ కేంద్ర నాయకత్వం , ప్రధాని మోడీ ,హోమ్ మంత్రి అమిత్ షా లు సైతం రాష్ట్ర నాయకత్వాన్ని ప్రత్యేకించి బండి సంజయ్ ని అభినందించారు. దీంతో సంజయ్ మాటకు ఢిల్లీలో విలువ పెరిగింది. టీఆర్ యస్ కూడా కాంగ్రెస్ కంటే బీజేపీ అంటేనే భయపడింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోంయిందని ,టీఆర్ యస్ ప్రత్యాన్మాయం బీజేపీనే అనే భావన సామాన్యులలో సైతం వచ్చింది. కాని బీజేపీ అందుకనుగుణంగా పార్టీని పటిష్ట పరచటంలో తేడా వచ్చింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికలో పొరపాటు జరిగిందా అనే భావన పార్టీలో సైతం ఉంది. టీఆర్ యస్ , కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా బీజేపీ లో చేరాలని అనుకున్న అనేక మంది ఆలోచనలో పడ్డారు. దూకుడుగా వ్యవహరించిన బండి సంజయ్ కొత్త వెనకడుగు వేస్తున్నారా ? రాష్ట్రంలో నాయకులూ ఆయనకు సహకరించటం లేదా ? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి సంజయ్ కి మధ్య తేడాలు ఉన్నాయా ? అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. దీనికి తోడు మతం విశ్వాసాల ఆధారంగా పార్టీని అభివృద్ధి చేయాలనీ అనుకోవడమా కూడా కొంత ప్రజలను ఆలోచింప జేస్తుంది. ఉత్తరాది తో పోల్చితే తెలుగు ప్రజలు చెతన్యవంతులు . మత రాజకీయాలు ఇక్కడ అంతగా పని చేయక పోవచ్చునని పరిశీలకుల భావన . అంతే కాకుండా రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో చెప్పిన మాట ప్రకారం కేంద్రం నడుచుకోవడం లేదనే వాదన ప్రజల్లో ఉంది. తెలంగాణాలో గిరిజన యూనివర్సిటీ , ఖాజీ పేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ , బయ్యారం ఉక్కు ప్రరిశ్రమ పై కేంద్రం స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తుంది. దీనిపై సందర్భం వచ్చినప్పుడల్లా టీఆర్ యస్ కేంద్రాన్ని ,బీజేపీని విరుకున పెడుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన హామీని పక్కన పెట్టడంమే కాకుండా , విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ చేస్తామని చెప్పటం పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ పట్ల ఆగ్రహంగా ఉన్నారు. అందువల్లనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీస స్థానాల్లో కూడా విజయం సాధించలేక పోయారు. తిరుపతి ఉపఎన్నికల్లో కూడా జనసేన నుంచి పట్టుబట్టి మరి తీసుకున్న సీట్లో ఎన్ని ఓట్లు వస్తాయనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నిక రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం ప్రతిపక్ష పాత్ర సరిగా నిర్వయించటంలేదని తాము దాన్ని భర్తీ చేస్తామని చెబుతున్నప్పటికీ ఆదిశగా చేస్తున్న ప్రయత్నాల్లో తప్పటడుగులు పడుతున్నాయి . బీజేపీ వాయిస్ కూడా తగ్గింది. బీజేపీ ఆంధ్రా లో ఎవరితో కలిసి నడవాలనేదానిపై క్లారిటీ ఉన్నట్లుగా కూడా లేదు . పవన్ కళ్యాణ్ ప్రస్తుతం స్నేహం ఉన్న ఆయన ఎంతకాలం తమతో కలిసి వస్తారనే దానిపై సందేహాలు ఉన్నాయి. చంద్రబాబు కలిసేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత పరిస్థితోల్లో బీజేపీ అందుకు సుముఖంగా లేదు . కేంద్రంలో వ్యవసాయ చట్టాల రద్దుకు జరుగుతున్న ఆందోళన కూడా దేశంలో బీజేపీపై ప్రభావం చూపిస్తున్నాయి . బాగా ఆశ పెట్టుకున్న బెంగాల్ లో అధికారంలోకి రాగలిగితే దాని ప్రభావం దేశవ్యాపితంగా ఉంటుంది. తిరిగి టీఎంసీ అధికారంలోకి వస్తే దేశవ్యాపితంగానే రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే ఆవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పట్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే వాదనలకు బలం తగ్గిపోతుంది. ప్రత్యేకించి తెలంగాణ పై పెట్టుకున్న ఆశలు కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. దీనిపై బీజేపీ నాయకత్వం ఎలాంటి ఎత్తుగడలతో ముందుకు పోతుందో చూడాలి మరి !!!

Related posts

హరీశ్, రాజాసింగ్ భేటీ రాజకీయ వర్గాల్లో కలకలం …

Drukpadam

కత్తిమీద సాముగా…కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక…

Drukpadam

ప్రధానిపై కేసీఆర్ పథకం ప్రకారం విషం చిమ్ముతున్నారు :కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజం!

Drukpadam

Leave a Comment