Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ప్లాస్మా దానానికి ముందుకొచ్చిన సచిన్ టెండూల్కర్

ప్లాస్మా దానానికి ముందుకొచ్చిన సచిన్ టెండూల్కర్
  • గత నెల 27న కరోనా బారిన సచిన్
  • ఈ నెల 8న డిశ్చార్జ్
  • నిన్న 48వ బర్త్ డే జరుపుకున్న దిగ్గజ క్రికెటర్
Sachin Tendulkar recovers from COVID to donate plasma

కరోనా మహ్మమారి కోరల నుంచి బయటపడిన టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చారు. గత నెల 27న సచిన్‌కు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరిన సచిన్ ఈ నెల 8న డిశ్చార్జ్ అయ్యాడు. శనివారం 48వ పుట్టిన రోజు జరుపుకున్న సచిన్ తాజాగా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చాడు.

తాను మొత్తం 21 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపిన సచిన్.. కరోనా రోగుల కోసం త్వరలో ప్లాస్మాను దానం చేయనున్నట్టు తెలిపాడు. కాగా, వైరస్ నుండి కోలుకున్నాక 14 రోజుల్లోపు ఎలాంటి లక్షణాలు లేకుంటే ప్లాస్మాను దానం చేయవచ్చు.

 

కరోనా నుంచి కోలుకుంటున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
కరోనాతో ఈ నెల 19న ఎయిమ్స్‌లో చేరిక
ఆరోగ్యం స్థిరంగా ఉందన్న కాంగ్రెస్
దేశ ప్రజలకు మన్మోహన్ కృతజ్ఞతలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకుంటున్నట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. కరోనా బారినపడిన మన్మోహన్ సింగ్ ఈ నెల 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా, మన్మోహన్ ఇప్పటికే కరోనా టీకా రెండు డోసులు వేయించుకున్నారు. గత నెల 4న తొలి విడత టీకా వేయించుకోగా, ఈ నెల 3న రెండో దఫా టీకా వేయించుకున్నారు. మన్మోహన్ కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ఈ మధ్య జ్వరం కూడా రాలేదని పేర్కొన్నారు. మన్మోహన్ కోలుకోవాలని ప్రార్థించిన భారత ప్రజలందరికీ ఈ సందర్భంగా రణ్‌దీప్ కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ఎన్నికలపై పెట్టిన దృష్టి కరోనా కట్టడిపై ఒక్క శాతం పెట్టినా బాగుండేది!:సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌

Drukpadam

కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు కేంద్రం చేయూత…

Drukpadam

ఆస్ట్రేలియాలో హింసాత్మకంగా మారిన టీకా వ్యతిరేక నిరసనలు…

Drukpadam

Leave a Comment