Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

బాగ్దాద్ లో ఘోరప్రమాదం… ఆక్సిజన్ ట్యాంకర్ పేలి 82 మంది దుర్మరణం

బాగ్దాద్ లో ఘోరప్రమాదం… ఆక్సిజన్ ట్యాంకర్ పేలి 82 మంది దుర్మరణం
కొవిడ్ చికిత్సలో ఆక్సిజన్ కు పెరుగుతున్న డిమాండ్
బాగ్దాద్ లోని ఖతీబ్ ఆసుపత్రిలో విషాద ఘటన
ఒక్కసారిగా పేలిపోయిన ఆక్సిజన్ ట్యాంకర్
పెద్ద సంఖ్యలో రోగుల మృతి
110 మందికి గాయాలు
ఆసుపత్రి వద్ద హృదయ విదారక దృశ్యాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా కొనసాగుతున్న తరుణంలో ఆక్సిజన్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఆక్సిజన్ ట్యాంకర్లు పేలడం, అగ్నిప్రమాదాలు జరగడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఘోరప్రమాదం జరిగింది. ఇక్కడి దియాలా బ్రిడ్జి ప్రాంతంలో ఉన్న ఖతీబ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ పేలిన దుర్ఘటనలో 82 మంది మృత్యువాతపడ్డారు. 110 మంది గాయపడ్డారు. హాస్పటల్ వద్ద హృదయ విదారక సంఘటనలు చోటుచేసుకున్నాయి . తమ వారిని రక్షించుకునేందుకు బంధువులు పడ్డ తపన కలిచి వేసిందని ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఆవకాశం ఉందని వార్త సంస్థల వెల్లడి .ఈ సంఘటనతో దేశం ఉలిక్కి పడ్డది. పెద్ద ఎత్తున అగ్ని మాపక సిబ్బంది పోలీసులు రంగంలోకి దిగారు.

ప్రమాదం సందర్భంగా ఖతీబ్ ఆసుపత్రి వద్ద దయనీయ దృశ్యాలు కనిపించాయి. తమవారిని కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చేసిన ప్రయత్నాలు కలచివేశాయి. ఆక్సిజన్ ట్యాంకర్ లీకవడంతో మంటలు శరవేగంతో వ్యాపించాయి. పలువురు కిటికీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ సందర్భంగా కొంత మందికి గాయాలు అయ్యాయి. ఆ దేశ ప్రధాని ఆదేశాల మేరకు బగ్దాద్ గవర్నర్ మహమ్మద్ జబ్బార్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా? ఆరా తీశారు . ప్రభుత్వం సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది .

Related posts

లాక్ డౌన్ దిశగా భారత్ …న్యూ ఇయర్ వేడుకలు లేనట్లే…?

Drukpadam

సరదా సందేశాల కారణంగా కొందరి ప్రాణాలు పోతున్నాయి: నెటిజన్లపై రేణు దేశాయ్ ఆగ్రహం

Drukpadam

చైనాలో కరోనా కల్లోలం.. 50 వేలకుపైగా కేసుల నమోదు!

Drukpadam

Leave a Comment