Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మోర్బీలో తీగల వంతెన కూలిన ప్రదేశాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

  • మోర్బీలో మచ్చూ నదిపై కూలిన కేబుల్ బ్రిడ్జి
  • 134 మంది దుర్మరణం
  • మోర్బీలో పర్యటించిన మోదీ
  • ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ
  • గుజరాత్ సీఎం, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం

గుజరాత్ లో మోర్బీలో జరిగిన తీగెల వంతెన ప్రమాదంలో అధికార ప్రకటన ప్రకారం 134 మరణించారు. ఈ సంఘటనపై ప్రపంచమే దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.అదే రాష్ట్రానికి చెందిన ప్రధాని మోడీ మోర్బీలో పర్యటన చేశారు .ఆపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ఇప్పటికే సంఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు.

గుజరాత్ లోని మోర్బీలో మచ్చూ నదిపై ఓ తీగల వంతెన కూలిపోయిన ఘటనలో 134 మంది మరణించడం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. సొంత రాష్ట్రం గుజరాత్ లో జరిగిన ఈ దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో, మోదీ నేడు గుజరాత్ పర్యటనకు వచ్చారు. మోర్బీలో తీగల వంతెన కూలిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, సంఘటన స్థలంలో జరుగుతున్న సహాయక చర్యల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

అనంతరం, ఈ ప్రమాదంలో గాయపడి మోర్బీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, వారు ధైర్యంగా ఉండాలని అన్నారు. ఆపై, గుజరాత్ ముఖ్యమంత్రి, అధికారులతో మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మోర్బీ వంతెన ప్రమాదంపై సమీక్ష చేపట్టారు.

Related posts

ఏపీ డీజీపీ సవాంగ్ బదిలీ.. కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం!

Drukpadam

ఏపీలో పాఠశాలల్లో ప్రార్ధనలు రద్దు …తెలంగాణాలో బడులు తెరిచే యోచన!

Drukpadam

మధ్యధరా సముద్రంలో పడవ మునక… 77 మంది వలసదారుల జలసమాధి!

Drukpadam

Leave a Comment