Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మైసూరు-చెన్నై వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆరంభం.. 

మైసూరు-చెన్నై వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆరంభం.. 

  • కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని
  • చెన్నై-మైసూరు 6.30 గంటల్లో ప్రయాణం
  • మూడు గంటల్లోనే చెన్నై నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చు

దక్షిణాదిన తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కూత మొదలు పెట్టింది. మైసూరు-చెన్నై పట్టణాల మధ్య ఈ రైలు ప్రయాణించనుంది. శుక్రవారం కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్ లో ఈ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఇది ఇక్కడి నుంచి చెన్నైకు బయల్దేరి వెళ్లింది.

పారిశ్రామిక కేంద్రం చెన్నై, టెక్నాలజీ, స్టార్టప్ కేంద్రం అయిన బెంగళూరు, ప్రముఖ పర్యాటక పట్టణం మైసూరు మధ్య అనుసంధానతను ఈ రైలు పెంచుతుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. దేశంలో ఇది ఐదో వందే భారత్ రైలు కావడం గమనించాలి. ఇక భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును సైతం ప్రధాని మోదీ ప్రారంభించారు. కాశీని దర్శించుకునే యాత్రికుల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

చెన్నై-బెంగళూరు-మైసూరు

  • చెన్నై నుంచి మైసూరు వెళ్లడానికి వందే భారత్ లో చైర్ కార్ రూ.1,200, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ కు రూ.2,295 చార్జీ వసూలు చేస్తారు. మైసూరు నుంచి చెన్నైకి ఇవే చార్జీలు 10 శాతం అధికంగా ఉన్నాయి.
  • 500 కిలోమీటర్ల మార్గాన్ని ఈ రైలు ఆరున్నర గంటల్లో చేరుకుంటుంది. మార్గ మధ్యంలో కాట్ పాడి, బెంగళూరు స్టేషన్లలోనే (రెండు స్టాపులు) ఇది ఆగుతుంది.
  • ఈ రైలు రోజువారీ సేవలు రేపటి నుంచి మొదలవుతాయి.
  • చెన్నై నుంచి బెంగళూరుకు మూడు గంటల్లో చేరుకోవచ్చు.
  • అన్ని కోచ్ లకు ఆటోమేటిక్ డోర్లు (హైదరాబాద్ మెట్రో కోచ్ ల మాదిరి) ఉంటాయి. సౌకర్యవంతమైన సీట్లు, వైఫై సదుపాయాలు ఉంటాయి.

Related posts

జర్నలిస్ట్ భావన కుమారి అరెస్ట్ అక్రమం…వెంటనే విడుదల చేయాలనీ ఐజేయూ డిమాండ్…

Drukpadam

వందే భారత్ రైలు ఖమ్మంలో ఆగుతుందా …?

Drukpadam

దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయిన ఎఫ్-35 యుద్ధ విమానం… ఆందోళనలో అమెరికా!

Drukpadam

Leave a Comment