Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మల్లారెడ్డి కుమారుడికి ఛాతీ నొప్పి.. ఆసుపత్రికి తరలింపు!

మల్లారెడ్డి కుమారుడికి ఛాతీ నొప్పి.. ఆసుపత్రికి తరలింపు!

నా కొడుకుని ఐటీ అధికారులు కొట్టారు: మంత్రి మల్లారెడ్డి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి
కొడుకును చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన మల్లారెడ్డి
తన కొడుకుని ఐటీ అధికారులు వేధించారని మండిపాటు
మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
మల్లారెడ్డి కాలేజీలకు డైరెక్టర్ గా ఉన్న కుమారుడు మహేందర్ రెడ్డి
సోదాల నేపథ్యంలో నిన్న ఇంట్లోనే ఉన్న మహేందర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. సూరారంలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, కుమార్తె, అల్లుడు, వియ్యంకుడి ఇళ్లలో నిన్న ఉదయం నుంచీ ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోదాల నేపథ్యంలో నిన్న మహేందర్ రెడ్డి ఇంట్లోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది.

మరోవైపు ఈరోజు కూడా వీరి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. నిన్న రాత్రి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న వారి ఇళ్లలోనే పడుకున్నారు. నిన్నటి సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. రూ. 4 కోట్ల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు.

మరోవైపు ఈ దాడులకు ముందురోజే ప్రధాని మోదీపై మల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత దేశ ప్రధాని కేసీఆరే అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఐటీ దాడులు ప్రారంభం కావడం గమనార్హం.

నా కొడుకుని ఐటీ అధికారులు కొట్టారు: మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఛాతీ నొప్పికి గురైన ఆయన హైదరాబాద్ లోని సూరారంలో ఉన్న ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐటీ అధికారులు తన కొడుకుని ఐటీ రెయిడ్స్ పేరుతో వేధించారని ఆరోపించారు. తన కొడుకుని ఐటీ అధికారులు కొట్టారని, అందుకే ఆయన ఆసుపత్రిపాలు అయ్యారని అన్నారు. రాత్రంతా సీఆర్పీఎఫ్ బలగాలతో కొట్టించారని చెప్పారు. తాము దొంగ వ్యాపారాలు చేయడం లేదని… కాలేజీలను స్థాపించి సేవ చేస్తున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడితే ఈ స్థాయికి చేరుకున్నామని అన్నారు. కష్టపడి సంపాదించి, నిజాయతీగా బతుకుతున్నామని చెప్పారు. బీజేపీ కేంద్ర వ్యవస్థలతో అక్రమంగా దాడులు చేయిస్తోందని అన్నారు.

రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే తమపై ఐటీ దాడులు చేస్తున్నారని… 200 మంది ఐటీ అధికారులతో తమపై ఐటీ దాడులు చేయించి భయపెట్టాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆసుపత్రికి మల్లారెడ్డితో పాటు ఐటీ అధికారులు కూడా వచ్చారు.

Related posts

ఫైజర్ సీఈవోపై జర్నలిస్టుల ప్రశ్నల వర్షం…

Drukpadam

అబూ సలేం కేసు విచారణ సందర్భంగా.. కేంద్ర ప్ర‌భుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం!

Drukpadam

అన్నమయ్య జిల్లాలో ఉండేందుకు ఈసీ అనుమతి కోరిన లోకేశ్!

Drukpadam

Leave a Comment