Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నందిగ్రామ్ ఎన్నికల ఫలితంపై కన్ఫ్యూజన్…

నందిగ్రామ్ ఎన్నికల ఫలితంపై కన్ఫ్యూజన్
-నందిగ్రామ్ లో మమతా గెలిచింది …
-లేదులేదు ఓడింది … సువెందు గెలిచారు
– ఓడినా,గెలిచినా నేనే సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తా
-ఎన్నికల సంఘంపై మమతా మండిపాటు
-ఇంకా లెక్కింపు పూర్తికాలేదన్న ఎన్నికల సంఘం
-ఫలితాన్ని ప్రకటించవద్దన్న టీఎంసీ
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. బీజేపీ అస్త్రశస్త్రాలు ప్రయోగించి బెంగాల్ లో మమతా ను ఓడించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు . కానీ నందిగ్రాంలో పోటీచేసిన మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువెందు అధికారిపై గెలిచారని ఒకసారి లేదు లేదు ఓడిపోయారని మరో సారి వార్తలు వచ్చాయి. 16 రౌండ్లు పూర్తీ అయ్యేసరికి మమతా కన్నా సువెందు అధికారికి 6 ఓట్ల మెజార్టీ ఉందని చివరగా 17 వ రౌండ్ మిగిలి ఉందని వార్తలు వచ్చాయి. 17 రౌండ్ కూడా అయిపోయిది మమతా ముందు 800 ఓట్లతో గెలిచారని వార్తలు వెలువడ్డాయి . ఎ ఎన్ ఐ
1200 ఓట్లతో మమతా గెలిచారని ప్రకటించింది. తరువాత ఏమి జరిగిందో గాని తిరిగి సువెందు అధికారి 1957 ఓట్లతో గెలుపొందారని వార్తలు వెలువడటంతో మమతా ఎన్నికల సంఘం పై ఫైర్ అయ్యారు. తన గెలుపోటములతో సంబంధం లేకుండా తానే ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించింది. అయితే తాను ఎన్నికల సంఘంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించింది . నందిగ్రామ్ ఫలితంపై యావత్తు దేశం దృష్టిసారించింది . అక్కడ అసలు ఏమిజరుగుతుందనే విషయంపై జాతీయ ,అంతర్జాతీయ మీడియా వాకబు చేయటం ప్రారంభించాయి. దీంతో ఇంకా అక్కడ లెక్కింపు జరుగుతుందని ఫలితం ప్రకటించలేదని ఎన్నికల సంఘం ప్రకటించడం కోసం మెరుపు . నందిగ్రామ్ లో ఆమె తన పార్టీ నుంచి ఎన్నికలకు ముందే బీజేపీ చేరిన కీలక నేత సువెందు అధికారిపై పోటీచేశారు. ఆమె ఈ సీటు ను వ్యూహాత్మకంగానే ఎంచుకున్నారు. సువెందు అధికారి ఆ ప్రాంతంలో పట్టున్న నేతగా పేరుంది. ఆయన్ను ఎక్కడకు వెళ్లకుండా కట్టడి చేయాలంటే నందిగ్రామ్ నుంచే పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే పోటీచేశారు.
మమతా బెనర్జీ కి అభినందనల వెల్లువ
బెంగాల్ టైగర్ గా ప్రకటించుకున్న మమతా బెనర్జీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొని నిజంగానే టైగర్ అనిపించుకున్నారు. ఆమె ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా లో అనేక సభల్లో పాల్గొని మమతా కు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే కాకుండా బెంగాల్ ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. కానీ వాటిని అక్కడ ప్రజలు నమ్మలేదు. సరికదా గతంలో కన్నా ఈసారి కొన్ని ఎక్కువ సీట్లలోనే గెలిపించారు. దీంతో ఘనవిజయం పొందిన దీదీ కి దేశవ్యాపితంగా అన్ని రాజకీయప్రత్యుల నుంచి అభినందనలు వెల్లు ఎత్తుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ , ఎన్ సి పి నేత శరద్ పవార్ , మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే , వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రిలు ఆమె కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

Related posts

తెలంగాణ ఎన్నికలపై ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం ఖర్గే ,రాహుల్ హాజరు..! …

Drukpadam

ఖమ్మం టీఆర్ యస్ లో ఐక్యత రాగం …

Drukpadam

దళితబందు దద్దరిల్లింది …ఏపీ లో కూడా పార్టీ పెట్టమంటున్నారు : కేసీఆర్!

Drukpadam

Leave a Comment