Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ .. ప్రకటించిన షర్మిల!

వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ .. ప్రకటించిన షర్మిల!
-పాలేరులో ఈ నెల 16న పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరుగుతుందన్న షర్మిల
-పార్టీ విధానాలను ఆరోజు ప్రకటిస్తానని వెల్లడి
-షర్మిల ఇంటి వద్ద బ్యారికేడ్లను తొలగించాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు
-ఆమె పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని హైకోర్టు సూటి ప్రశ్న ..

వైయస్సార్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు .ఆమె తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలనే మంచి పట్టుదలతో ఉన్నారు .దీంతో ఆమె ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు . ఈమేరకు ఆమె హైద్రాబాద్ లోని తన నివాసం వద్ద మీడియా తో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేస్తానని ప్రకటించారు . గతంలోనే ఖమ్మం జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన సందర్భంగా ఆమె పాలేరు లో పోటీచేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది . అప్పుడు ఆమె మాటలను తేలిగ్గా కొట్టిపారేసిన రాజకీయపార్టీలు తిరిగి ప్రకటించడం తో ఆలోచనలో పడ్డారు . వాస్తవంగా ఆమె పార్టీకి నిర్మాణం లేదు . అయితే వైయస్సార్ అంటే ప్రజల్లో ఆదరణ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనులు ,సంక్షేమ పథకాలు , ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు ఇప్పటికి ప్రజల్లో జరగని ముద్ర వేశాయి. ఆమె కూడా వైయస్ ఆర్ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే తనతోనే సాధ్యమని అంటున్నారు .అయితే ఇప్పటికిప్పుడు అయితే ఆమె గెలుపు అంత సులువేం కాదు . ఏ ధైరంతో ఆమె పాలేరును ఎంచుకున్నారేది ఆసక్తిగా మారింది.

ఈనెల 16 వ తేదీన ఆమె పాలేరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు ప్రకటించారు . అక్కడ తమ పార్టీ విధివిధానాలను వెల్లడిస్తానని చెప్పారు .

రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడమే లక్ష్యంగా షర్మిల పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, పాదయాత్రకు పోలీసులు అనుమతిని ఇవ్వకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని హైకోర్టు నేరుగా రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇరువైపు వాదనలు విన్న అనంతరం పాదయాత్ర చేసుకోవడానికి హైకోర్టు అనుమతిస్తూ, కొన్ని షరతులను విధించింది. రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని, వ్యక్తిగత విమర్శలు చేయకూదని కండిషన్ పెట్టింది.

ఇదే సమయంలో షర్మిల ఇంటి వద్ద ఉంచిన బ్యారికేడ్లను తొలగించాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు షర్మిల మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు తెలిపారు. పాలేరు పార్టీ కార్యాలయానికి ఈనెల 16న భూమి పూజ జరుగుతుందని వెల్లడించారు. పార్టీ విధానాలను ఆరోజు వెల్లడిస్తానని కూడా ఆమె తెలిపారు . పార్టీ కార్యాలంకోసం ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి సమీపంలో భూమి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది …

Related posts

దీదీ కొత్త ఎత్తుగడ …టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ గా ఎంపిక!

Drukpadam

పార్లమెంట్ సీట్ల పంపుదలపై హింట్ ఇచ్చిన ప్రధాని మోడీ…

Drukpadam

పంట పొలాల్లో రేవంత్ రెడ్డి… రాహుల్ స‌భ‌కు రావాలంటూ రైతుల‌కు ఆహ్వానం!

Drukpadam

Leave a Comment