Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా ఎఫెక్ట్: ఏప్రిల్‌లో 75 లక్షల ఉద్యోగాల ఊస్టింగ్!

కరోనా ఎఫెక్ట్: ఏప్రిల్‌లో 75 లక్షల ఉద్యోగాల ఊస్టింగ్!
  • లాక్‌డౌన్, ఆంక్షల కారణంగా ఊడుతున్న ఉద్యోగాలు
  • ఏప్రిల్ నాటికి 7.97కు చేరుకున్నజాతీయ నిరుద్యోగిత రేటు
  • భవిష్యత్తులో ఉద్యోగ కల్పన పెను సవాలుగా మారుతుందన్న సీఎంఐఈ
75 lakh people lose jobs in April as lockdowns sprout CMIE

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్న వేళ ఉద్యోగాలు మళ్లీ ఊడుతున్నాయి. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. గడచిన (ఏప్రిల్)లో దేశవ్యాప్తంగా 75 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సీఎంఐఈ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేశ్ వ్యాస్ తెలిపారు. ఫలితంగా నిరుద్యోగిత రేటు మరింత పెరిగిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ కల్పన పెను సవాలుగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

కాగా, మార్చిలో 6.50 శాతంగా ఉన్న జాతీయ నిరుద్యోగిత రేట ఏప్రిల్ నాటికి 7.97 శాతానికి చేరుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పట్టణాల్లో నిరుద్యోగిత రేట 9.13 శాతంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 7.13 శాతంగా ఉంది. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆంక్షల ప్రభావం ఉద్యోగాలపై పడిందని వ్యాస్ పేర్కొన్నారు. అయితే, గతంలోలా దారుణ పరిస్థితులు లేకపోవడం కొంత ఊరట కలిగించే అంశమన్నారు. గతంలో నిరుద్యోగిత రేట 24 శాతానికి చేరుకుందని వ్యాస్ గుర్తు చేశారు.

Related posts

మీరు పీఎం కిసాన్ ఈ-కేవైసీ చేయించారా…?లేకపోతె చేయించండి …

Drukpadam

కొంగలపై బెంగ! అవి రాకపోవడంతో చింతపల్లి ఊరంతా చింత…

Drukpadam

ఖమ్మంజిల్లాలో జిల్లాలో ఈరోజు నామినేషన్‌ వివరాలు…

Ram Narayana

Leave a Comment